Bhagyalakshmi Temple under the Devadaya Department! copy

దేవాదాయ శాఖ పరిధిలోకి భాగ్యలక్ష్మి టెంపుల్ !

తక్షణమే ఈవోను నియమించాలని ఆదేశం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో చార్మినార్‌ను ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం దేవాదాయశాఖ పరిధిలోకి రానుంది. ఈ మేరకు దేవాదాయశాఖను ట్రిబ్యునల్ ఆదేశిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భాగ్యలక్ష్మీ టెంపుల్ నిర్వహణ బాధ్యతను మహంత్ మనోహర్ దాస్, మహంత్ రాంచంద్ర దాస్ 1960 దశకం నుంచి చూస్తున్నారు. ప్రస్తుతం ఆలయ నిర్వహణ బాధ్యతలను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఆదేశాలు వెలువడ్డాయి. భాగ్యలక్ష్మీ ఆలయానికి తక్షణమే ఈవోను నియమించి ఆలయంలో ఎలాంటి అవకతవకలు లేకుండా ముందుకు వెళ్లాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ ఆలయ ఆదాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఫిర్యాదులపై కోర్టు విచారణ తర్వాత ఈ ఆదేశాలు జారీ అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

 దేవాదాయ శాఖ పరిధిలోకి భాగ్యలక్ష్మి

ఆలయ అభివృద్ధికి సహకారం

యూపీకి చెందిన రాజ్ మోహన్ దాస్ ఆలయంపై ఆజమాయిషీ చెలాయిస్తున్నాడంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఆలయ నిర్వహణకు సంబంధించి ఏకగ్రీవ నియంత్రణ ఉండాలని ఆమె కోర్టులో వాదించారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ఎండోమెంట్ ట్రిబ్యునల్, ఆలయాన్ని దేవాదాయశాఖ పరిధిలోకి తీసుకురావాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో దేవాదాయశాఖ కమిషనర్ ఆలయ నిర్వహణకు ప్రత్యేక ఈవోను (ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) నియమించాలని ఆదేశించారు. ఆలయ ఆదాయ వ్యయం, నిర్వహణ విధానాలు అధికారిక పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నిర్ణయంతో ఆలయ అభివృద్ధికి సహకారం అందుతుందని, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మార్గం సుగమమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Posts
Hyderabad:పెట్రోల్ పోసి భార్యను హతమార్చిన భర్త
Hyderabad:పెట్రోల్ పోసి భార్యను హతమార్చిన భర్త

అనుమానం ఒక కుటుంబాన్ని నాశనంచేసింది.భార్యను కోల్పోయేంత పరాకాష్టకు ఓ భర్త చేరుకున్నాడు.హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినా, చివరకు పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ Read more

జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం
lorry cleaner was burnt ali

జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ఇసుక లారీ ని వెనుక నుంచి వ్యాన్ ఢీకొట్టిన సంఘటనలు మంటలు చెలరేగాయి. వ్యాను ముందు భాగంలో చిక్కుకున్న వ్యాన్ క్లీనర్ Read more

మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.?
1 Planning Tirumala Tirupati

తిరుమలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసి, మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దడమే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రధాన లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ దిశగా 2019లో ఐఐటీ నిపుణులు రూపొందించిన Read more

వెంకటేష్, రానా, సురేష్ బాబులపై కేసు!
వెంకటేష్, రానా, సురేష్ బాబులపై కేసు!

చిత్ర పరిశ్రమలో ప్రముఖ ఉనికికి ప్రసిద్ధి చెందిన దగ్గుబాటి కుటుంబం, ఆస్తి వివాదంలో చట్టపరమైన ఎదురుదెబ్బను ఎదుర్కొంటోంది. ఆస్తిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఆదేశాలను విస్మరించి, Read more