ఫుడ్ డెలివరీ సంస్థలు తరచూ వినియోగదారుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాయి. తాజాగ బెంగళూరులో చోటు చేసుకుంది. వర్షం పడకపోయినా జొమాటో ‘రెయిన్ సర్జ్ ఫీజు’ (Zomato ‘rain surge fee’) వసూలు చేస్తోందంటూ ఓ కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.జూన్ 10న బెంగళూరుకు చెందిన ప్రఖ్యాత్ రాయ్, ట్విట్టర్‌లో జొమాటోపై ఫైర్ అయ్యారు. బెంగళూరులో (In Bangalore) చినుకు కూడా లేదు. కానీ నాలుగు గంటలుగా జొమాటో వర్షం పేరుతో సర్జ్ ఫీజు వేస్తోంది. రాత్రి 1కి ట్రాఫిక్ ఛార్జీ వేస్తారా? అంటూ @zomato, @zomatocare ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. కొద్ది గంటల్లోనే ఆయన పోస్ట్ వైరల్ అయింది.ఈ ఫిర్యాదుపై జొమాటో కేర్ స్పందించింది. హాయ్ ప్రఖ్యాత్, ఈ విషయాన్ని తనిఖీ చేస్తాం. మీ ఆర్డర్ డీటెయిల్స్ డీఎం చేయండి అని అడిగింది.
వినియోగదారుడి సజెషన్లు – సిస్టమ్‌ను అప్‌డేట్ చేయండి
ప్రఖ్యాత్ రాయ్ మరో ట్వీట్‌లో జొమాటోకు కొన్ని సూచనలు చేశారు. “మీ వాతావరణ API ఆధారాల్ని సమీక్షించండి. వాస్తవికత కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించండి. మీ రెయిన్ సర్జ్ 6 గంటలుగా కొనసాగుతోంది. నా ట్వీట్ టైమ్, లొకేషన్ చూసుకోండి” అంటూ సూచించారు.
గోల్డ్ యూజర్లకు సర్జ్ మినహాయింపు ఉండదా?
ఈ నేపథ్యంలో జొమాటో, తన గోల్డ్ సభ్యులకు కూడా స్పష్టత ఇచ్చింది. “మే 16 నుంచి వర్ష సమయంలో సర్జ్ ఫీజు మినహాయింపు ఉండదు” అంటూ యాప్‌లో నోటిఫికేషన్ పంపింది.
డెలివరీ పార్ట్‌నర్లకు ఫండింగ్ పేరిట ఫీజులు?
జొమాటో ప్రకారం, ఈ అదనపు ఛార్జీలు వర్షంలో పని చేసే డెలివరీ పార్ట్‌నర్ల కోసం. అయితే వర్షం లేకపోయినా ఛార్జీలు పడటం వినియోగదారులను అసంతృప్తికి గురిచేస్తోంది.
Read Also : Narendra Modi : మోదీకి నెతన్యాహు ఫోన్ కాల్ ఎందుకంటే?