హైదరాబాద్ నగరంలో టాలీవుడ్ యువ కథానాయకుడు Bellankonda Srinivas రాంగ్ రూట్‌లో కారు నడిపి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారు. ఈ ఘటన జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్ట్ కాలనీ ప్రాంతంలో చోటుచేసుకుంది.సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో ప్రకారం, బెల్లంకొండ శ్రీనివాస్ స్వయంగా తన కారును నడుపుతూ రాంగ్ రూట్‌లో వస్తుండగా, విధుల్లో ఉన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ గమనించి వెంటనే అతన్ని నిలదీశారు.

కానిస్టేబుల్ అతడిని ప్రశ్నించగా, శ్రీనివాస్ తన వాహనాన్ని వెనక్కి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఈ సంఘటనపై నెటిజన్లు స్పందిస్తూ, “సినీ హీరోలు చట్టం నుంచి బయటపడలేరు” అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.ఈ ఘటనతో సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బెల్లంకొండ శ్రీనివాస్ రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వంటి విషయాలు చర్చనీయాంశమయ్యాయి.ఇది సినీ ప్రముఖులు కూడా చట్టానికి లోబడి ఉండాలని, వారి ప్రవర్తన సమాజానికి ఆదర్శంగా ఉండాలని సూచించే సంఘటన.
Read Also : Cannes Film Festival : దుస్తులపై కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కొత్త రూల్స్ ..ఎందుకంటే ?