బీట్‌రూట్ కుర్మా | Beetroot Kurma Recipe in Telugu
పుష్కలమైన పోషక విలువలతో, కలర్‌ఫుల్‌గా, తక్కువ సమయంలో సులభంగా తయారయ్యే బీట్‌రూట్ కుర్మా(Beetroot Kurma Recipe). ఇది చపాతీ, పూరీ, రైస్ కు అద్భుతంగా సరిపోతుంది. ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఈ వంటకాన్ని మీ కుటుంబానికి తప్పకుండా ప్రయత్నించండి.
కావలసిన పదార్థాలు:
- బీట్‌రూట్ ముక్కలు – 1 కప్పు
- ఉల్లిగడ్డ – 1 పెద్దదిగా తరిగినది
- పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి)
- కరివేపాకు – 1 రెబ్బ
- అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1/2 టీస్పూన్
- పసుపు – 1/2 టీస్పూన్
- కారం – 2 టీస్పూన్లు
- గరం మసాలా – 1/4 టీస్పూన్
- ఉప్పు – తగినంత
- జీలకర్ర – 1/2 టీస్పూన్
- ఆవాలు – 1/2 టీస్పూన్
- పెరుగు – 1 కప్పు (బాగా చిలికినది)
- నూనె – 2 టేబుల్ స్పూన్లు
తయారు చేసే విధానం:
ముందుగా ఒక కప్పు నీళ్లు పోసి బీట్‌రూట్ ముక్కలను సన్నని మంటపై 10 నిమిషాల పాటు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి.అవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా వేసి మరో 2 నిమిషాల పాటు వేయించాలి.తర్వాత అందులో ఉడికించిన బీట్‌రూట్ ముక్కలు వేసి మరో 5 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించాలి.స్టవ్ ఆఫ్కు చేసి, చివరగా బాగా చిలికిన పెరుగు వేసి చక్కగా కలిపితే రుచికరమైన బీట్‌రూట్ కుర్మా సిద్ధం!








Read Also: Meal Maker Masala Vada Recipe: మిల్మేకర్ వడ