మిస్ వరల్డ్ 2025 (Miss World 2025)పోటీల్లో భాగంగా నిర్వహించిన ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ (‘Beauty with a Purpose’) విభాగంలో మిస్ ఇండోనేషియా మోనికా కెజియా సెంబిరింగ్ (Miss Indonesia Monica Kezia Sembiring) అత్యుత్తమంగా నిలిచారు. ఆమె చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలు, మహిళా సాధికారతపై అవగాహన పెంచే పనులు అంతర్జాతీయ జడ్జింగ్ ప్యానెల్‌ను ఆకట్టుకున్నాయి. బ్యూటీ కంటే బాధ్యత ముఖ్యం అనే సందేశాన్ని ఆమె పటిష్ఠంగా వ్యక్తీకరించడంతో విజేతగా ఎంపికయ్యారు.
సుధా రెడ్డి – బ్రాండ్ అంబాసిడర్‌గా మిస్ వరల్డ్ సంస్థ ప్రకటన
ఈ పోటీ సందర్భంగా ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ బ్రాండ్ అంబాసిడర్గా హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కృష్ణారెడ్డి గారి సతీమణి సుధా రెడ్డి పేరును మిస్ వరల్డ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. సుధారెడ్డి ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగం అవుతుండటం, ప్రపంచ స్థాయిలో ఆమె సేవా ఆత్మను గుర్తించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రకటనతో భారతదేశానికి గౌరవం లభించింది.
సామాజిక సేవపై దృష్టి పెట్టిన అందాల భామలు
ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న అందాల భామలు తమ అందంతోపాటు, సామాజిక బాధ్యతను ఎలా మిళితం చేస్తున్నారో వివరించారు. ప్రతి ఒక్కరు తాము చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించడంతో పోటీలకు కొత్త రూపు వచ్చినట్లు కనిపించింది. ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ వేదికగా అందం ఒక్కటే కాకుండా, ఆందంలతో పాటు సేవా దృక్పథం కూడా ఉండాలనే సందేశం బలంగా వినిపించింది.
Read Also : Kankhajura Review : ‘కంఖజూర’ సిరీస్ రివ్యూ!