हिन्दी | Epaper
IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్

BCCI: ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ తో ఐపీల్ వాయిదా

Sharanya
BCCI: ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ తో ఐపీల్ వాయిదా

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం ఉదయం అత్యవసరంగా సమావేశం నిర్వహించి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ – 2025 టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికీ లీగ్ దశలో 12 మ్యాచ్‌లు మిగిలి ఉండగా, భద్రతా కారణాల వల్ల వాటిని నిర్వర్తించకూడదని నిర్ణయించబడింది.

BCCI
BCCI

ఏఏ నగరాల్లో మ్యాచ్‌లు జరగాల్సి ఉంది?

వాయిదా పడిన మ్యాచులు ఈ క్రింది నగరాల్లో జరగాల్సి ఉంది. లఖ్‌నవూ, హైదరాబాద్, అహ్మదాబాద్, దిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబయి, జైపుర్‌ నగరాలు ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది.

ధర్మశాలలో మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోవడం

గురువారం హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ భద్రతా కారణాలరీత్యా అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే.  రెండు క్వాలిఫయర్లు, ఒక ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ మిగిలి ఉంది. షెడ్యూల్ ప్రకారం మే25న కోల్ కతా వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు 16పాయింట్లతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. టోర్నీలో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో బీసీసీఐ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. అంతకుముందు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందిస్తూ.. ‘‘పరిస్థితిని బట్టి టోర్నమెంట్‌ భవిష్యత్తుపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటాం. అన్నింటికన్నా ఆటగాళ్ల భద్రత ముఖ్యం’’ అని పేర్కొన్నారు.

Read also: IPL 2025 : ప్లే ఆఫ్ రేస్: గుజరాత్ టైటాన్స్, RCB, MI, PBKS ముందంజలో

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870