భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2024-25 సంవత్సరానికి గాను సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఈ లిస్టులో మొత్తం 34 మంది ఆటగాళ్లకు కాంట్రాక్టులు లభించాయి. నాలుగు కేటగిరీలుగా విభజించిన ఈ లిస్టులో పలువురు స్టార్ క్రికెటర్లతో పాటు కొత్తగా భారత జట్టులోకి వచ్చిన యువ క్రీడాకారులు చోటు దక్కించుకోవడం గమనార్హం.

A+ కేటగిరీలో –
A+ కేటగిరీకి చెందిన ఆటగాళ్లకు ఏడాదికి రూ.7 కోట్ల వేతనంతో కాంట్రాక్టు లభిస్తుంది. ఈ జాబితాలో వరుసగా మూడోసారి వరుసగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా స్థిరంగా నిలిచారు. వీరిలో బుమ్రా మాత్రమే టీ20లకు అందుబాటులో ఉండగా, మిగిలిన ముగ్గురు ఇప్పటికే ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు. అయినప్పటికీ, వారి అనుభవం, మార్కెట్ వ్యాల్యూను దృష్టిలో ఉంచుకుని వీరికి A+ కేటగిరీ కొనసాగించడం BCCI చురుకుదనం అని చెప్పవచ్చు.
A కేటగిరీలో
A కేటగిరీలో ఏడాదికి రూ. 5 కోట్ల వేతనం లభిస్తుంది. ఈ జాబితాలో కేఎల్ రాహుల్, మోహమ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, మోహమ్మద్ షమీ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో శుభ్‌మన్ గిల్, సిరాజ్ వంటి యువ ఆటగాళ్లు ఇటీవల మంచి ప్రదర్శనలతో అభిమానులను మెప్పించారు. గాయాల వల్ల గతంలో అర్ధచంద్రుడైన పంత్ తిరిగి ఫిట్‌గా మైదానంలో అడుగుపెడుతుండటంతో A కేటగిరీలో చోటు దక్కడం విశేషం.
B కేటగిరీలో
ఈ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు రూ. 3 కోట్ల వేతనం లభిస్తుంది. టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బౌలింగ్ ఆల్‌రౌండర్ కుల్దీప్ యాదవ్, యంగ్ స్టార్ యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్‌లు ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పటివరకు తక్కువ అవకాశాల్లో మెరుపులు చూపించిన జైస్వాల్‌కు B కేటగిరీలో చోటు దక్కడం అతడి భవిష్యత్తు పట్ల ఆశలను కలిగిస్తోంది. శ్రేయస్ మరియు ఇషాన్ కిషన్‌లు గత ఏడాది జాబితాలో స్థానం కోల్పోయి ఈసారి తిరిగి రావడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
C కేటగిరీలో చోటు దక్కించుకుంది ఎవరంటే..
యువ ఆటగాళ్లు ఎక్కువ మంది ఈ కేటగిరీలోనే ఉన్నారు. టీ20 స్పెషలిస్ట్ రింకూ సింగ్‌తో పాటు తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేశ్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పాటీదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాశ్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా. వీరికి ఏడాదికి రూ. 1కోటి చొప్పున వేతనం అందుతుంది. వీరిలో హర్షిత్ రాణా, అభిషేక్ శర్మ, రజత్ పాటీదార్, నితీశ్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తిలకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు తొలిసారిగా అందుకున్నారు. BCCI యువతరాన్ని ప్రోత్సహిస్తున్న తీరు అభినందనీయం. ఆటగాళ్లను ఎంపిక చేసిన విధానం అనేక అంశాలపై ఆధారపడి ఉంది.
Read also: Robot Dog : IPL రోబోటిక్ డాగ్ పేరు ఏంటంటే?