7న గోవాలో జరిగే ఓబిసి జాతీయ మహాసభకు బస్సుల్లో బయలుదేరిన బిసి నాయకులు
హైదరాబాద్ : దేశంలోని బిసిలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని బిసి సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. బిసి రిజర్వేషన్లపై రెండు రోజులు ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలని నిర్వహించాలని బిసి సంక్షేమ సంఘం (BC Welfare Association) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 7న గోవా రాష్ట్రంలో జరిగే జాతీయ ఓబిసి మహాసభ సభకు తెలంగాణ రాష్ట్రం నుంచి మంగళవారం బయలుదేరిన బిసి సంఘాల నాయకులున్న బస్సులను కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్ కురుమ, బిసి మహిళా సంఘం అధ్యక్షురాలు బి మనిమంజరి జండా ఊపి ప్రారంభించారు.

మహా సభలో
దేశంలో మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారంలో వాటా కల్పించాలని, విద్యాఉద్యోగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని ఎన్నో సంవత్సరాలుగా బిసి సంఘాలు (BC Associations) పోరాటం చేస్తున్నాయని గుర్తు చేశారు. కానీ దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు గుత్తాధిపత్యం చేపట్టి బిసి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ వారిని ఓట్లు వేసే యంత్రాలుగానే చూస్తున్నారు తప్ప వారికి రాజ్యాధికారంలో వాటా కల్పించాలని ఏ కోశాను ఏరాజకీయ పార్టీ భావించడంలేదన్నారు. ఈ నెల 7న గోవాలో జరిగే జాతీయ ఓబిసి మహా సభలో దేశవ్యాప్తంగా బిసిల సమస్యలపై విస్తృ తంగా చర్చించి దేశవ్యాప్తంగా బిసి ఉద్యమాన్ని విస్తరించే విధంగా పోరాటం చేయడానికి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడా నికి 28 రాష్ట్రాలకు సంబంధించిన ఓబిసినేతలు పాల్గొంటారని తెలిపారు. స్వాతం త్రం వచ్చి 75సంవత్సరాలు గడిచిన బడుగు వర్గాల హక్కుల కోసం అడుక్కోవడం ఇక చాలని ఇకనుంచి బిసిలు ప్రత్యక్షంగా పోరాటాలకు సిద్ధం కావాలన్నారు.
తెలంగాణ బిసి సంక్షేమ సంఘం అంటే ఏమిటి?
తెలంగాణ బిసి సంక్షేమ సంఘం అనేది రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల (Backward Classes – BCs) హక్కులు, సంక్షేమం కోసం పని చేసే ఒక సామాజిక సంస్థ. ఈ సంఘం విద్య, ఉపాధి, రాజకీయ హక్కులు, రిజర్వేషన్ల కోసం కృషి చేస్తుంది.
బిసి సంక్షేమ సంఘంలో ఎలా సభ్యత్వం పొందవచ్చు?
స్థానిక బిసి సంఘం కార్యాలయం లేదా అధికారిక సోషల్ మీడియా పేజీల ద్వారా సభ్యత్వ ఫారమ్ పొందవచ్చు. సభ్యత్వం కోసం BC కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: