Bank strike on March 24-25

మార్చి 24-25న బ్యాంకుల సమ్మె

న్యూఢిల్లీ: బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్లు నెరవేర్చాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్స్‌తో జరిగిన చర్చలు విఫలమయ్యాయని బ్యాంకు యూనియన్లు తెలిపాయి. దీంతో ప్రణాళిక ప్రకారం మార్చి 24- 25 తేదీల్లో యథావిధిగా సమ్మె జరుగుతుందని స్పష్టం చేశాయి. ఐబీఏతో జరిగిన సమావేశంలో అన్ని కేడర్లలో నియామకాలు, ఐదు రోజుల పని దినాలు వంటి సమస్యల్ని యూఎఫ్‌బీయూ సభ్యులు లేవనెత్తారు. వీటిపై జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈ సమస్యలపై ఎటువంటి పరిష్కారం లభించలేదని నేషనల్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ బ్యాంక్‌ ఎంప్లాయీస్ జనరల్‌ సెక్రటరీ ఎల్‌.చంద్రశేఖర్ అన్నారు. అందుకే ముందు ప్రకటించినట్లుగానే రెండు రోజుల పాటు సమ్మె ఉంటుందని తెలిపారు.

మార్చి 24-25న బ్యాంకుల సమ్మె

ఉద్యోగుల పనితీరుపై సమీక్షలు

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వర్క్‌మెన్‌, ఆఫీసర్‌ డైరెక్టర్‌ పోస్టుల్ని భర్తీ చేయడం వంటి డిమాండ్లతో యూఎఫ్‌బీయూ తొలుత సమ్మెను ప్రకటించింది. ఉద్యోగుల పనితీరుపై సమీక్షలు, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలకు సంబంధించి ఇటీవల జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కూడా ఈ యూనియన్లు కోరుతున్నాయి. ఇటువంటి చర్యలు ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగిస్తాయని ఆరోపిస్తున్నాయి.
యూఎఫ్‌బీయూలో ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్ ఆపోసియేషన్‌ , ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌ , నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్‌ బ్యాంక్‌ ఎంప్లాయీస్ , ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ వంటి ప్రధాన బ్యాంకు సంఘాలు ఉన్నాయి.

Related Posts
మరికాసేపట్లో మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్‌ ప్రసంగం..
Trumps speech to the supporters soon

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం పెన్సిల్వేనియాలో ట్రంప్‌ ఘన విజయం Read more

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భారీ ఊరట !
Goshamahal MLA Raja Singh got a huge relief in the court!

మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరిస్తూ కేసుల కొట్టివేత హైదరాబాద్‌: తెలంగాణ బీజేపీ కీలక నేత, గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కు భారీ ఊరట లభించింది. ఆయన Read more

భారతీయ విద్యార్ధులకు కెనడా కొత్త వీసా రూల్స్
భారతీయ విద్యార్ధులకు కెనడా కొత్త వీసా రూల్స్

భారతీయ విద్యార్ధులు, టూరిస్టులకు ఇప్పటికే అమెరికా సహా పలు దేశాలు షాకులిస్తుండగా తాజాగా ఈ జాబితాలో కెనడా కూడా చేరిపోయింది. ఇన్నాళ్లూ భారతీయులకు సురక్షిత దేశంగా కొనసాగిన Read more

తదుపరి బీజేపీ జాతీయాధ్యక్షుడు ఎవరు?
బీజేపీ కొత్త జాతీయాధ్యక్షుడు ఎవరు? కీలక అభ్యర్థుల పేర్లు ఇవే

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) త్వరలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకోనుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, బీజేపీ తన జాతీయాధ్యక్షుడి పదవిని ఎవరికప్పగించాలనే Read more