Bank holidays for the month of April for Telugu states

Bank holidays: తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏప్రిల్‌ నెల బ్యాంకు సెలవు ఇలా..

Bank holidays : ఏప్రిల్‌ నెలలో చాలా రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా శని, ఆదివారాలతో కలిపి దాదాపు 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. స్థానిక పండగల దృష్ట్యా రాష్ట్రాలకు, రాష్ట్రాలకు మధ్య సెలవుల్లో వ్యత్యాసం ఉంటుంది. ఏప్రిల్‌ 1న ఆర్థిక సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఖాతాల సర్దుబాటు దృష్ట్యా బ్యాంకులు సాధారణ కార్యకలాపాలు నిర్వహించవు. జార్ఖండ్‌లో సర్‌హుల్ అనే గిరిజన పండుగను కూడా జరుపుకుంటారు. ఇది కొత్త సంవత్సరం ప్రారంభానికి సూచన. ప్రకృతిని ఆరాధించే పండుగ ఇది.

Advertisements
 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏప్రిల్‌

తెలంగాణలో మొత్తం 11 రోజులు, ఆంధ్రప్రదేశ్‌లో 10 రోజులు

ఇక, ఏప్రిల్‌ 5న బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి, 14న అంబేడ్కర్‌ జయంతి, 18న గుడ్‌ ఫ్రైడే కారణంగా తెలంగాణలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకులకు జగ్జీవన్‌రామ్ జయంతి రోజు మినహా తెలంగాణ మాదిరిగానే ఏప్రిల్‌ 1, 14, 18 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. శని, ఆదివారాలు కలుపుకొంటే ఏప్రిల్‌ నెలలో తెలంగాణలో మొత్తం 11 రోజులు, ఆంధ్రప్రదేశ్‌లో 10 రోజులు బ్యాంకులు పనిచేయవు. బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ, నెట్ బ్యాంకింగ్, ATM సేవలు సాధారణంగా అందుబాటులో ఉంటాయి. మీరు ఆన్‌లైన్ ద్వారా డబ్బును బదిలీ చేయవచ్చు, ATM నుండి డబ్బును తీసుకోవచ్చు.

Related Posts
హైదరాబాద్‌లో ఫ్లూ వ్యాప్తి: వైద్యుల హెచ్చరికలు
హైదరాబాద్‌లో ఫ్లూ వ్యాప్తి: వైద్యుల హెచ్చరికలు

గత రెండు వారాలుగా హైదరాబాద్లో వైరల్ జ్వరాలు మరియు ఛాతీ ఇన్ఫెక్షన్లు గణనీయంగా పెరుగుతున్నాయని వైద్యులు గమనించారు. రోగులందరూ సాధారణంగా కోలుకుంటున్నప్పటికీ, శ్వాసకోశ వ్యాధుల పెరుగుదల దృష్ట్యా Read more

వంశీ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
Hearing on Vallabhaneni Vamsi bail petition postponed

అమరావతి: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌పై విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. వంశీకి బెయిల్‌ మంజూరు చేస్తే సాక్ష్యాలను Read more

అత్యంత పేదరిక జిల్లాగా కర్నూలు
Kurnool

ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కర్నూలు జిల్లా అత్యంత పేదరికాన్ని ఎదుర్కొంటున్న జిల్లాగా సోషియో-ఎకనామిక్ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం, కర్నూలు జిల్లాలో 42 శాతం మంది ప్రజలు Read more

ఇంజినీరింగ్ విద్యార్థులకు మంత్రి దామోదర రాజనర్సింహ తీపి కబురు
minister damodar raja naras

తెలంగాణలో ఇంజినీరింగ్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉస్మానియా, JNTU పరిధిలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి డిటెన్షన్ విధానం అమలు చేయబోమని మంత్రి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *