haseena

పాక్ తో బంగ్లాదేశ్‌‌‌‌ స్నేహం భారత్ కు కొత్త సమస్యలు

షేక్ హసీనా సర్కార్ పడిపోయిన తర్వాత.. బంగ్లాదేశ్ పరిస్థితి దిగజారుతూ వస్తోంది. మతోన్మాదం, దాడులు, హింస, అశాంతి, అంతర్గత కలహాలతో బంగ్లాదేశ్ నిత్యం ఒక నరకంలా మారిపోతోంది. మరోవైపు.. భారత్‌కు వ్యతిరేకంగా మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం.. అనేక చర్యలు తీసుకుంటోంది. ఇక భారత్‌కు బద్ధ శత్రువులుగా ఉన్న పాకిస్తాన్, చైనాలతో బంగ్లాదేశ్ చేతులు కలుపుతోంది. మరోవైపు.. గతంలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ సంబంధాలు మెరుగవుతుండటం భారత్‌కు మరింత ఇబ్బందికర పరిస్థితిగా మారింది. మరోవైపు.. ఇప్పటివరకు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న వకార్ ఉజ్ జమాన్‌ను గద్దె దింపే యత్నాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ అనుకూల వ్యక్తిగా పేరు ఉన్న లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఫైజుర్ రెహ్మాన్‌.. ఆర్మీ చీఫ్ పదవిలోకి రావాలని భావిస్తున్నాడు.

మరోవైపు.. ఎప్పుడూ లేని విధంగా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ సైనిక సాయాన్ని కోరుతోంది. ఈ మధ్య కాలంలో రెండు దేశాల మధ్య రాకపోకలు బాగా పెరిగాయి. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ అధికారులు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్నారు. అంతేకాకుండా భారత సరిహద్దు ప్రాంతాల్లో సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుంటుండడం మన దేశానికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులు, విద్యార్థి నాయకులు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడం.. అక్కడి ఆర్మీ అధికారులతో భేటీ అవుతుండటం.. భారత్‌కు తలనొప్పిగా మారింది.

వకార్ ఉజ్ జమాన్‌ని దించేందుకు కుట్ర
త్వరలోనే బంగ్లాదేశ్ సైన్యంలో తిరుగుబాటు వస్తుందనే ఊహాగానాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. ఆర్మీ చీఫ్ పదవి నుంచి వకార్ ఉజ్ జమాన్‌ని దించేందుకు కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ భావాలు కలిగిన.. పాక్ అనుకూలుడిగా పేరు కలిగిన లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఫైజుర్ రెహ్మాన్ ఈ కుట్రకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆర్మీ చీఫ్‌ను గద్దె దించడానికి.. బంగ్లాదేశ్ సైన్యంలోని నిఘా విభాగం అయిన డీజీఎఫ్ఐ నుంచి మద్దతును తీసుకునేందుకు ఫైజుర్ రెహ్మాన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Related Posts
ట్రంప్ కేబినెట్‌లో ఎలన్ మస్క్, వివేక్ రామస్వామి కీలక పాత్రలు
20241112 musk ramaswamy split

ఎలన్ మస్క్ మరియు వివేక్ రామస్వామి, ట్రంప్ కేబినెట్‌లో కీలక పాత్రలను పోషించడానికి చర్చలు జరిపినట్లు నివేదికలు ప్రకటిస్తున్నాయి. ఈ ప్రముఖ వ్యక్తులు, తమ వ్యాపార అనుభవంతో Read more

US Elections 2024 : దూసుకెళ్తున్న ట్రంప్
US Elections 2024 Rushing

రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ యూఎస్ ఎన్నికల కౌంటింగ్లో దూసుకెళ్తున్నారు. 20 రాష్ట్రాల్లో ఆయన గెలుపొందారు. మిసిసిపీ, నార్త్ డకోటా, నెబ్రాస్కా, ఒహాయో, ఓక్లహామో, Read more

“4B” ఉద్యమం: ట్రంప్ మద్దతుదారులపై మహిళల నిరసన..
4B movement scaled

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత, రాజకీయంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే, ఈ విజయంతో ఒక కొత్త సామాజిక ఉద్యమం ఏర్పడింది, Read more

అదానీపై కేసు.. స్పందించిన అమెరికా అధ్యక్ష భవనం
White House Responds To Adani Bribe Gate Allegations

వాషింగ్టన్‌: అమెరికాలో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీపై కేసు నమోదుకావడం గ్లోబల్‌గా చర్చనీయాంశమైంది. సౌర విద్యుదుత్పత్తి సరఫరా ఒప్పందాలు చేసుకోవడానికి భారత్‌లో రూ. 2,029 కోట్ల లంచాలు Read more