Bandi Sanjay key comments on the budget

Bandi Sanjay: బడ్జెట్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Bandi Sanjay : రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ని పరిశీలిస్తే.. డొల్ల అని తేలిపోయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. బడ్జెట్ తీరును విశ్లేషిస్తే.. అబద్దాలు.. అంకెల గారడీ.. 6 గ్యారంటీలకు పాతరేసేలా రాష్ట్ర బడ్జెట్ ఉందని, ఓం భూం బుష్ అంటూ మాయ చేసేందుకే ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కన్పిస్తోందని ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా గత బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులను పరిశీలిస్తే పొంతనే లేదని, అయినప్పటికీ బడ్జెట్ కేటాయింపులు పెంచి రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసేందుకు బడ్జెట్ను సాధనంగా చేసుకోవడం సిగ్గు చేటన్నారు. ఆరు గ్యారంటీలను పూర్తిగా తుంగలో తొక్కేశారని ఆరోపించారు.

బడ్జెట్ పై బండి సంజయ్

బడ్జెట్‌లో గొప్పలు చెప్పిన సర్కార్

ఎన్నికలకు ముందు మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా పేర్కొన్న కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చాక చిత్తుకాగితంగా మార్చినట్లు ఈ బడ్జెట్ ద్వారా వెల్లడైందన్నారు. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం భారీగా పెరిగినట్లు బడ్జెట్లో గొప్పలు చెప్పిన సర్కార్.. అప్పుల వివరాలను కూడా బడ్జెట్ లో పొందుపరిచి ఒక్కో తెలంగాణ పౌరుడిపైనా, చివరకు పుట్టబోయే బిడ్డపైనా ఎంత అప్పు భారం ఉందో వాస్తవాలను వివరిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

రూ. 4 వేల నిరుద్యోగ భృతి ఊసేలేదు

విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు దారుణంగా ఉన్నాయని విమర్శించారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచిందని బండి సంజయ్ పెదవి విరిచారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం కనీసం పది శాతం హామీలను కూడా అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. ఇదొక అసమర్థ ప్రభుత్వమని ఘాటుగా వ్యాఖ్యానించారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, రూ. 4 వేల నిరుద్యోగ భృతి ఊసేలేదని ఆయన అన్నారు.

Related Posts
ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
Massive drug bust at Mumbai airport

ముంబయి: కస్టమ్స్ అధికారులు ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్, బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరిగిన దాడుల్లో 16.49 కోట్ల విలువైన 1700 గ్రాముల Read more

గత ఏడాది అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీలు వీరే
celbs income

ఆదాయపు పన్ను భారీగా చెల్లించిన భారతీయ సెలబ్రిటీలకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. ఇందులో మన సౌత్ స్టార్ హీరో 2వ స్థానం దక్కడం ఇంటర్నెట్‌లో సంచలనం Read more

కాంగ్రెస్ హామీలపై హరీష్ రావు విమర్శలు
కాంగ్రెస్ హామీలపై హరీష్ రావు విమర్శలు

తెలంగాణ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పెద్ద హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు Read more

లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. నలుగురు మృతి
A travel bus collided with

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఈ ఘటనలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *