మార్చిలోపు ఆస్తుల లెక్క తేల్చాలి..అధికారులకు ఆదేశాలు
హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో ఎనిమీ ప్రాపర్టీస్ పై కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ‘తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీస్ పై సమీక్ష నిర్వహించాం. మార్చిలోపు ఆస్తుల లెక్క తేల్చాలని ఆదేశించాం అన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లోని ఎనిమీ ప్రాపర్టీస్ ఉన్నాయి. చాలా ఆస్తులు ఆక్రమణలు జరిగాయి. వాటిని ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలి.

పాకిస్తాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది
నిబంధనలకు అనుగుణంగా పొజిషన్లో ఉన్న సామాన్య ప్రజలు, రైతులకు ఇచ్చేందుకు ఉన్న అవకాశాలేమిటి..? అనే అంశాలపై పూర్తిస్థాయిలో సర్వే, రికార్డ్స్ పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను కోరాము. గతంలో పాకిస్తాన్‌లో యుద్ధం సందర్భంగా ఇండియా నుండి పాకిస్తాన్ వెళ్లిన ప్రజలు, ఇక్కడ తమ ఆస్తులను వదిలేసి వెళ్లారు. అట్లాగే పాకిస్తాన్ నుండి ఇండియాకు వచ్చిన వాళ్లు అక్కడ తమ ఆస్తులను వదిలేశారు. అయితే ఆ ఆస్తులు పాకిస్తాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించి అమ్మేసుకుంది.
భూముల అమ్మకం – ఆస్తుల సముపార్జన
కాగా, 1947లో జరిగిన భారత విభజన సమయంలో, ఆ స్థలాల్లో నివసిస్తున్న పెద్ద సంఖ్యలో ముస్లిం, హిందూ, సిఖ్ లు తమ భూములు, ఆస్తులు వదిలి వెళ్లిపోవలసి వచ్చింది. ఈ సమయంలో ఎంతోమంది వారి ఆస్తులను వదిలిపోయారు లేదా వివాదాలు ఎదుర్కొన్నారు. పాకిస్తాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించి, ఈ ఆస్తులను విక్రయించడం మరియు వారి స్వంత హక్కులను రక్షించుకోవడానికి పోరాడే స్థితి ఎక్కువ. అక్కడి అధికారుల సహకారంతో, ఆస్తుల విక్రయాలు జరిగాయి. అయితే ఈ పరిణామాలు చాలా రాజకీయ, చారిత్రిక పరమైన సమస్యలు తలెత్తించాయి.