हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Bandh:కర్ణాటక లో కొనసాగుతున్నబంద్

Anusha
Bandh:కర్ణాటక లో కొనసాగుతున్నబంద్

కర్ణాటకలో కన్నడ భాషోద్యమ నాయకుడు వాటల్ నాగరాజ్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్త బంద్ కొనసాగుతోంది. ఈ తెల్లవారుజామున ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్‌కు పిలుపునిచ్చారు. కర్ణాటక-మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం కారణంగా ఈ నిరసన టెన్షన్ గా మారింది.

సరిహద్దు వివాదం

కర్ణాటక-మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం కారణంగా ఈ నిరసన ఉధృతంగా మారింది.కర్ణాటక- మహారాష్ట్ర మధ్య సుదీర్ఘకాలంగా సరిహద్దు వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కర్ణాటక బెళగావి జిల్లాలోని 800లకకు పైగా గ్రామాలు తమవేనంటూ వాదిస్తూ వస్తోంది మహారాష్ట్ర. గతంలోనూ ఈ రెండు రాష్ట్రాల్లో పలుమార్లు ఉద్యమాలు చోటు చేసుకున్నాయి.ఈ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో- కొద్దిరోజుల కిందటే కర్ణాటక ఆర్టీసీ బస్ కండక్టర్‌పై మహారాష్ట్రానికి చెందిన ఒకరు దాడి చేశారు. టికెట్ కొనే విషయంలో ఇద్దరి మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలీవానగా మారింది. దాడి వరకూ వెళ్లింది. ఈ ఘటనలో కండక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. వారం రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.

కర్ణాటక వ్యాప్తంగా బంద్ ప్రభావం

కండక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. వారం రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.ఈరోజు తెల్లవారు జామున 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ కొనసాగుతుంది. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులేవీ రోడ్డెక్కట్లేదు. ఓలా, ఉబేర్ వంటి సంస్థలు సైతం బంద్‌లో భాగస్వామ్యం అయ్యాయి. బెంగళూరు సహా రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం వరకూ సినిమాల ప్రదర్శనను కూడా నిలిపివేశారు. రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు బంద్ అయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలేవీ పని చేయట్లేదు.

MixCollage 21 Mar 2025 02 04 PM 7540 2025 03 0412e2fa2618a9f29bd94caf4a2f3515 16x9

కెంపేగౌడ బస్ స్టేషన్‌

బెంగళూరు సహా దాదాపు అన్ని జిల్లాల్లో రవాణా వ్యవస్థ స్తంభించింది. మెజస్టిక్ కెంపేగౌడ బస్ స్టేషన్‌లో ప్రయాణికుల సంఖ్య పూర్తిగా తగ్గింది.కర్ణాటక ఆర్టీసీ (కెఎస్ఆర్ టిసి) మరియు ప్రైవేట్ బస్సులు రోడ్లపైకి రాలేదు.ఓలా, ఉబర్ క్యాబ్‌లు కూడా బంద్‌లో భాగస్వామ్యం అయ్యాయి.ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సినిమా థియేటర్లు మధ్యాహ్నం వరకూ మూసివేయబడ్డాయి.హోటళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి.బెంగళూరు మెజస్టిక్, మైసూరు శాటిలైట్ బస్ స్టేషన్లు పూర్తిగా ఖాళీగా కనిపించాయి.

బంద్ ప్రభావం

మైసూరు, రామనగర,మద్దూరు, మండ్య, చామరాజనగర ప్రాంతాలకు వెళ్లే బస్సులు లేవు.మంగళూరు, ఉడుపి జిల్లాల్లో బంద్ ప్రభావం అధికంగా ఉంది.ఆంధ్రప్రదేశ్ సరిహద్దు,హిందూపురం, అనంతపురం, మదనపల్లి, తిరుపతి వెళ్లే బస్సులు తగ్గిపోయాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870