Bandaru Vijaya Lakshmi who

అలయ్ బలయ్‌కి సీఎం రేవంత్‌ను అహ్వానించిన బండారు విజయ లక్ష్మీ

18 ఏళ్లుగా ఎలాంటి ఆటంకంలేకుండా అలయ్ బలయ్ ని ఘనంగా అలయ్ బలయ్ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 19వ అలయ్ బలయ్ ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా ఈ నెల 13న నిర్వహించబోతున్నారు.

కాగా ఈ సారి ఈ కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ కుమార్తే బండారు విజయ లక్ష్మీ నిర్వహిస్తున్నారు. ఈ నెల 13 న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనాలని ఇప్పటికే పలువురికి ఆహ్వానం పలికిన విజయ లక్ష్మీ.. ఈ రోజు ఉదయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారిని కలిసి అలయ్ బలయ్ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఆనవాయితీగా వస్తున్న ఈ అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరు కావాలని బండారు విజయ లక్ష్మీ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.

తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను కొనసాగిస్తూనే.. ఫోటో ఎగ్జిబిషన్ రూపంలో స్టాల్స్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు అలయ్ బలయ్ వంటకాల్లో మిల్లెట్స్ ను కూడా చేర్చినట్లు తెలిపారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులను రాజకీయాలకు అతీతంగా అందరినీ ఆహ్వానించినట్లు తెలిపారు.

Related Posts
Om Birla : నినాదాలు రాసి ఉన్న టీషర్టులు ధరించి సభకు రావొద్దు: స్పీకర్‌
Don't come to the House wearing T shirts with slogans on them.. Speaker Om Birla

Om Birla: ప్రతిపక్ష పార్టీ ఎంపీలు నినాదాలు రాసి ఉన్న టీ షర్టులు ధరించి లోక్ సభకు రావడం పై లోక్ సభ స్పీకర్ ఓంబిర్ల అసహనం Read more

విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేశ్‌
విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేశ్‌

అమరావతి: తన పరువుకు భంగం కలిగించేలా అసత్య కథనాలు ప్రచురించారంటూ సాక్షి దినపత్రికపై వేసిన పరువు నష్టం కేసులో మంత్రి నారా లోకేశ్ నేడు విశాఖ కోర్టుకు Read more

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మికి భారీ ఊరట
kova lakshmi

ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి తన ఎన్నికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఊరట పొందారు. 2023 ఎన్నికల్లో కోవలక్ష్మి అందించిన అఫిడవిట్‌లో ఆదాయపన్ను లెక్కల్లో Read more

ఇంజినీరింగ్ విద్యార్థులకు మంత్రి దామోదర రాజనర్సింహ తీపి కబురు
minister damodar raja naras

తెలంగాణలో ఇంజినీరింగ్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉస్మానియా, JNTU పరిధిలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి డిటెన్షన్ విధానం అమలు చేయబోమని మంత్రి Read more