Balakrishna : పాటల ధోరణిపై మహిళా కమిషన్ సీరియస్ ఇటీవల తెలుగు సినీ పాటల్లో అసభ్యకర పదాలు అభ్యంతరకర డ్యాన్స్ మూమెంట్స్ పెరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ నటించిన ‘ఢాకు మహారాజు’ సినిమాలోని ‘దబిడి దిబిడి’ పాట వివాదాస్పదంగా మారింది. ఈ పాటలో బాలయ్యతో పాటు ఊర్వశి రౌతేలా నటించగా, ఇందులోని కొంత భాగం అభ్యంతరకరంగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల అన్యాయాన్ని ప్రోత్సహించే కంటెంట్‌కి ఇకపై కఠిన చర్యలు తెలుగు చిత్రాల్లో మహిళలను కించపరిచే విధంగా పాటలు, డ్యాన్స్ మూమెంట్స్ ఉంటున్నాయని అనేక ఫిర్యాదులు అందుతున్నాయని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద వెల్లడించారు. ఇలాంటి కంటెంట్‌ను ప్రోత్సహించకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆమె హెచ్చరించారు.

“సినిమాలు సామాజిక బాధ్యతతో ఉండాలి పాటలు, లిరిక్స్, డ్యాన్స్ మూమెంట్స్ యువతపై ప్రభావం చూపుతాయి. యువత తప్పుదారి పడేలా చేయడాన్ని సహించం” అని శారద అన్నారు.ఇతర సినిమాలపై కూడా విమర్శలు ఇది మొదటిసారి కాదు. ‘పుష్ప 2’ ‘మిస్టర్ బచ్చన్’, ‘రాబిన్ హుడ్’ వంటి సినిమాల్లోని కొన్ని పాటలు కూడా విమర్శలు ఎదుర్కొన్నాయి. మహిళా కమిషన్ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఈ వివాదం నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ గీత రచయితలు, దర్శకులు, సంగీత దర్శకులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మరి దీనికి టాలీవుడ్ ఎలా స్పందిస్తుందో చూడాలి!