ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో కీలక వైద్య సదుపాయం అందుబాటులోకి రానుంది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి (Basavatarakam Cancer Hospital) నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13న భూమిపూజ చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.
ఏర్పాట్లను పరిశీలించిన బాలకృష్ణ, సన్నిహితులు
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను నటుడు, శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) స్వయంగా పరిశీలించారు. ఆయనతో పాటు గాంధీ, సిద్ధాంతి నాగమల్లేశ్వరరావు కూడా ఉన్నారు. ఈ సందర్శన సందర్భంగా ఆసుపత్రి నిర్మాణ (Hospital construction) ప్రణాళికల వివరాలను సీఆర్డీఏ అదనపు కమిషనర్ ప్రవీణ్ బాలకృష్ణకు వివరిస్తూ, నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.
మూడు దశల్లో నిర్మాణం – 21 ఎకరాల స్థలంలో ఆసుపత్రి
మొత్తం 21 ఎకరాల విస్తీర్ణంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించనున్నట్లు బాలకృష్ణ (Balakrishna) తెలిపారు. ఈ ఆసుపత్రి నిర్మాణం మూడు దశల్లో జరుగుతుందని పేర్కొన్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో క్యాన్సర్ చికిత్సకు ఇది ప్రధాన కేంద్రంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
భగవంత్ కేసరి చిత్రానికి జాతీయ అవార్డు – బాలకృష్ణ స్పందన
ఇటీవలి కాలంలో బాలకృష్ణ నటించిన “భగవంత్ కేసరి” చిత్రానికి జాతీయ అవార్డు లభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మహిళా సాధికారతపై స్పష్టమైన సందేశాన్ని ఈ సినిమా అందించిందని చెప్పారు. ఇకపై తాను తీసే ప్రతి చిత్రంలో సమాజానికి ఉపయోగపడే అంశాలు ఉంటాయని హామీ ఇచ్చారు. హిందూపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. పరిశ్రమలు, అంతర్రాష్ట్ర రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: