దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం, భక్తులకు ఆధ్యాత్మిక ప్రేరణను కలిగించే పవిత్ర క్షేత్రంగా నిలిచింది. రామ భక్తుడు భద్రుని తపస్సుతో శ్రీరాముడు వెలసిన ఈ ప్రాంతం, శతాబ్దాలుగా రామారాధకుల ఆధ్యాత్మిక యాత్రకు కేంద్రంగా ఉంది. భద్రాచల దేవస్థానం చరిత్రలో భక్త రామదాసు (కంచర్ల గోపన్న) పేరును ప్రస్తావించకుండా ఉండలేం. ఇతని నిర్భయమైన భక్తి, శ్రీరాముడిని కేంద్రబిందువుగా పెట్టిన ఆలయ నిర్మాణం, తెలుగు భక్తికవిత్వానికి చిరస్థాయిగా నిలిచాయి.

ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి వేళ భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణం భక్తులకు ఆధ్యాత్మికోత్సాహాన్ని కలిగించే దివ్య ఘట్టంగా నిలుస్తుంది. ఇది కేవలం ఒక ఉత్సవం కాదు, భక్తులు తమ జీవితంలో దర్శించాల్సిన పవిత్ర ఘట్టంగా భావిస్తారు. ఈ కళ్యాణం కోసం లక్షలాది భక్తులు భద్రాచలాన్ని ఆశ్రయిస్తారు. మిథిలా మండపం ఈ కళ్యాణ వేడుకకు వేదికగా నిలుస్తుంది. కళ్యాణ సమయంలో భక్తుల నయనాలను మైమరిపించేలా అలంకరణలు, సీతారాముల విగ్రహాలు, వేదోచ్ఛారణల మధ్య జరగే కళ్యాణ క్రతువు నిజంగా భవ్య ఉంటుంది.
మిథిలా మండపం – శిల్ప కళా వైభవానికి అద్దం
మిథిలా మండపం ఒక ఆధ్యాత్మిక ఆభరణం. దక్షిణ భారతీయ ఆలయ నిర్మాణ శైలిలో నిర్మితమైన ఈ మండపం, రామాయణంలోని ప్రధాన ఘట్టాలను చెక్కిన శిల్పాలతో అద్భుతంగా ఆకర్షిస్తుంది. ఈ మండపాన్ని తమిళనాడుకు చెందిన ప్రముఖ శిల్పకళాకారుడు గణపతి స్తపతి రూపకల్పన చేశారు. ఈ మండపంలో ఏకశిలపై చెక్కిన రామాయణ ఘట్టాలు, ప్రతి ముడి శిల్పం భక్తిని చాటుతుంది. పుత్రకామేశ్టి యాగం నుండి సీతా స్వయంవరం, వనవాసం, రామరావణ యుద్ధం వంటి ఘట్టాలు ప్రత్యక్షంగా కనిపించేలా చెక్కబడ్డాయి. ఇది భక్తుల హృదయాలను తాకే అనుభూతిని కలిగిస్తుంది. 1958లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం ఆలయ పునరుద్ధరణ సంఘంను ఏర్పాటు చేసింది. దీనికి దేవాదాయ శాఖ మంత్రి కల్లూరి చంద్రమౌళి అధ్యక్షత వహించారు. 1960 మే 30న మిథిలా స్టేడియం నిర్మాణానికి భూమి పూజ జరిగింది. 1964 జూన్ 4న అప్పటి సీఎం నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా ఇది ప్రారంభమైంది. ఒక్కసారిగా 20,000 మందికి పైగా భక్తులు ఒకేచోట కూర్చొని కళ్యాణం వీక్షించేందుకు వీలుగా ఐదు ఎకరాల్లో నిర్మించబడిన ఈ స్టేడియం, నేటికీ భక్తుల పూజా కేంద్రంగా నిలుస్తోంది. మిథిలా అనే పేరే సీతాదేవి జన్మస్థలాన్ని సూచిస్తుంది. ఈ మండపంలో ఉన్న శిల్పాలు, పేర్లే కాదు, పురాణ గాథలను ప్రతిబింబించడంలో గొప్ప నైపుణ్యం చూపించాయి. భక్తులు ఈ మండపాన్ని చూసి సీతారాముల కళ్యాణాన్ని గుండె లోతుల్లోనూ అనుభూతి చెందగలుగుతారు. మిథిలా మండపం సాంప్రదాయ దక్షిణ భారతీయ ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. దీని స్తంభాలు, శిల్పాలు రామాయణ ఘట్టాలను వర్ణిస్తూ ఉంటాయి, ఇది దర్శనీయంగా మరియు ఆధ్యాత్మికంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మిథిలా మండపం దర్శనం భక్తులకు శాంతిని, ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. దీని పవిత్రత, చారిత్రక నేపథ్యం కారణంగా భద్రాచలం యాత్రలో తప్పక చూడవలసిన ప్రదేశంగా మిథిలా స్డేడియం గుర్తింపు పొందింది.
Read also: Sriramanavami : నేడు భద్రాద్రికి సీఎం రేవంత్ రెడ్డి రాక