Babu who did PhD in cheating..Jagan

చీటింగ్ లో పీహెచ్ డీ చేసిన బాబు: జగన్‌

అమరావతి: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం ఉదయం మీడియా ముందుకు వచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలనలో ఒక్క సంవత్సరం జరిగిన ఒడిదుడుకులను తీసుకుని ప్రజల్లో తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబును నమ్మొద్దని ప్రజలకు ఎంతగానో విజ్ఞప్తి చేశానని, చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమేనని చెప్పినట్లు జగన్ పేర్కొన్నారు. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని చెప్పినట్లు గుర్తుచేశారు.

Advertisements

ఈ తొమ్మిది నెలల కాలానికి బడ్జెటరీ అకౌంట్ అప్పులే రూ.80 వేల కోట్లని జగన్ వివరించారు. అమరావతి పేరుతో రూ.52 వేల కోట్లు, మార్క్‌ఫెడ్‌, సివిల్‌ సప్లయి ద్వారా రూ.8 వేల కోట్లు, ఏపీఎండీసీ ద్వారా రూ. 5 వేల కోట్లు.. మొత్తంగా రూ. 1.45 లక్షల కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు. మరి ఇన్ని అప్పులు చేసిన ప్రభుత్వం ఎన్ని బటన్ లు నొక్కిందని, ఎంతమంది పేదలకు డబ్బు పంచిందని జగన్ నిలదీశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది నెలలలోనే ఏపీలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆరోపించారు. అప్పులు చేయడంలో చంద్రబాబు సర్కారు అన్ని రికార్డులను బద్దలు కొట్టిందని విమర్శించారు.

image

ఈ ప్రభుత్వం వచ్చాక వలంటీర్లను ఎలా మోసం చేసిందో చూశామని, కొత్తగా ఉద్యోగాలు కల్పించలేదని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.6 లక్షల మంది వలంటీర్లతోపాటు బెవరేజెస్ లోని 18 వేల మంది ఉద్యోగులను ప్రభుత్వం తొలగించిందని చెప్పారు. తమ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన మత్స్యకార భరోసా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు, లా నేస్తం, రైతు భరోసా, వసతి దీవెన తదితర పథకాలకు కూటమి సర్కారు మంగళం పాడిందని జగన్ ఆరోపించారు. ఆ పథకాలను నిలిపివేసిందని విమర్శించారు.

Related Posts
Supriya Sule: విమానయాన సంస్థలకు కఠినమైన నిబంధనలు విధించాలి: సుప్రియా సూలే
Supriya Sule impatience with Air India

Supriya Sule: ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఎయిర్‌ ఇండియా విమానంపై అసహనం వ్యక్తంచేశారు. తాను ప్రయాణించాల్సిన విమానం కోసం గంటకు పైగా వేచి చూడాల్సి వచ్చిందని Read more

Telangana: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు : ఒంటిపూట బడులు
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఒంటిపూట బడులు

Telangana: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు : ఒంటిపూట బడులు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతుండటంతో, ప్రభుత్వాలు విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. మార్చిలోనే Read more

Posani: వరుస కేసులతో పోసాని ఇప్పట్లో వచ్చేనా
వరుస కేసులతో పోసాని ఇప్పట్లో వచ్చేనా

టీడీపీ కేంద్ర కార్యాలయంలో పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు కర్నూలు జిల్లా కల్లూరు మండలం కల్లూరుకు చెందిన కె. సత్యనారాయణ శెట్టి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. Read more

169 ఎకరాల్లో సోలార్ సెల్ ప్లాంట్
Solar cell plant on 169 acr

ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన రంగంలో మరో కీలక ముందడుగు పడుతోంది. తిరుపతి జిల్లాలోని నాయుడుపేట వద్ద సోలార్ సెల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ Read more

×