ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) గురించి అందరికీ తెలుసు.కానీ ఇప్పుడు ఆయన తండ్రి ఎరాల్ మస్క్ (Errol Musk) భారత్ పర్యటనకు సిద్ధమవుతున్న సంగతి మీకు తెలుసా? జూన్ 1 నుండి 6వ తేదీ వరకు ఆయన ఇండియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో అయోధ్య రామమందిరం సందర్శన ముఖ్యాంశంగా నిలవనుంది.ఈ పర్యటన వెనక ఓ ఆసక్తికర కారణం ఉంది. హర్యానాలో ప్రధాన కార్యాలయం కలిగిన ప్రముఖ సంస్థ సెర్వోటెక్ పవర్ సిస్టమ్స్,ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ పరికరాలను తయారుచేస్తుంది.ఈ సంస్థ ఎరాల్ మస్క్‌ను గ్లోబల్ అడ్వైజరీ బోర్డు సభ్యుడిగా ఇటీవల నియమించింది. ఆ కంపెనీ ఆహ్వానం మేరకు ఆయన భారత్‌కు వస్తున్నారు.

అయోధ్య రామాలయానికి ప్రత్యేక పిలుపు
ఇండియా టూర్‌లో అయోధ్య రామమందిరం సందర్శన ప్రత్యేక ఆకర్షణగా మారింది.జూన్ పర్యటనలో భాగంగా,ఎరాల్ మస్క్ శ్రీరాముని దివ్య దర్శనం కోసం అయోధ్యకు వెళ్తున్నారని సమాచారం.విదేశీ ప్రముఖులు ఇలా భారత దేవాలయాలను సందర్శించడం అరుదు. ఈ సందర్భంగా మతపరమైన ఆసక్తికర చర్చలు జరుగే అవకాశముంది.
భారత పరిశ్రమలకు గ్రీన్ టెక్‌పై దృష్టి
ఇక వ్యాపార పరంగా చూస్తే,ఎరాల్ మస్క్ పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు.హరిత ఇంధన సాంకేతికతపై ఆయన దృష్టి సారించనున్నారు.ముఖ్యంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు,సోలార్ ఎనర్జీ ఎగుమతులు వంటి రంగాలలో భారత ప్రభుత్వంతో మంతనాలు జరిపే అవకాశం ఉంది.భారత పర్యటన సమయంలో ఎరాల్ మస్క్ పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు,అధికారులతో సమావేశం కావచ్చని తెలుస్తోంది.ఈ మీటింగ్‌లు భారత పరిశ్రమలకు, ముసుగులో ఉన్న స్టార్ట్‌ప్స్‌కు మంచి అవకాశాలను తీసుకొచ్చేలా ఉన్నాయి. భారత మార్కెట్‌పై అతడికి ఉన్న ఆసక్తి వల్ల భవిష్యత్తులో ఎక్కువ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
వెనుక ఎలాన్ మస్క్ స్కెచ్ ఉందా?
ఎలాన్ మస్క్ తన కంపెనీలతో భారత్‌లో వ్యాపార విస్తరణపై ఆలోచిస్తున్న సమయంలో,ఆయన తండ్రి పర్యటన చర్చనీయాంశమవుతోంది.ఇది కేవలం స జుఫల్నా,లేదా వ్యూహాత్మక పిలుపా అనే ప్రశ్నలు వెలువడుతున్నాయి.ప్రత్యేకించి EV మార్కెట్‌లో టెస్లా ఎంట్రీ కోసం ఈ పర్యటన మొదటి అడుగుగా మారుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది.
జూన్ 6న దక్షిణాఫ్రికా వెళ్తారు
ఇండియా పర్యటన పూర్తయిన తర్వాత,జూన్ 6న ఎరాల్ మస్క్ దక్షిణాఫ్రికా బయలుదేరనున్నారు.ఆయన పర్యటన భారత మీడియా, పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.ఈ పర్యటన ద్వారా భారత్‌లో గ్రీన్ ఎనర్జీ రంగానికి బలమైన మద్దతు అందుతుందనే అంచనాలు ఉన్నాయి.
Read Also : Budget Recharge : రూ. 200 మొబైల్ రీచార్జ్ ప్లాన్‌లు కావాలా : ఆఫర్లు ఇవే..