हिन्दी | Epaper

Ayodhya: శ్రీరామ నవమి సందర్బంగా అయోధ్యలో అదిరిపోయే ఘట్టం

Sharanya
Ayodhya: శ్రీరామ నవమి సందర్బంగా అయోధ్యలో అదిరిపోయే ఘట్టం

శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య ఇప్పుడు భక్తిశ్రద్ధలతో నిండిపోయింది. ప్రతి ఏటా శ్రీరామనవమి పర్వదినం ఎంతో వైభవంగా జరుగుతుంది కానీ ఈ సారి అది మరింత ప్రత్యేకంగా మారింది. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో ఏర్పాట్లు, పూజా కార్యక్రమాలు, ప్రత్యక్ష ప్రసారాలతో ప్రపంచ వ్యాప్తంగా రామ భక్తులను ఆకట్టుకుంటోంది.

ఈ ఏడాది శ్రీరామనవమిని పురస్కరించుకుని అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయం అందంగా ముస్తాబైంది. రంగురంగుల విద్యుద్దీపాలు, పుష్పాల తండాలు, పటాకులు, దేవతా రూపాల ఏర్పాట్లు ఆలయానికి కొత్త జీవాన్ని నింపాయి. భక్తులు చూసేందుకు రెండు కన్నులైనా చాలవంటుంది. అయోధ్య ప్రధాన వీధులన్నీ ప్రత్యేకంగా విద్యుద్దీపాలతో మెరిసిపోతున్నాయి. ఆలయ ద్వారాలు, టెంపుల్ స్ట్రీట్లు, ప్రధాన రథం మార్గాలు. శ్రీరాముడు త్రేతాయుగంలో జన్మించిన ఏడవ అవతారం. సూర్య వంశానికి చెందిన దశరథ మహారాజుకు జన్మించిన రాముడు, అబిజిత్ ముహుర్తంలో జన్మించినట్లు పురాణాలు పేర్కొంటాయి. నవమి తిథి రోజున శ్రీరాముడు జన్మించాడు. అదే రోజున సీతారాముల కళ్యాణం జరిగింది, 14 ఏళ్ల అరణ్యవాసానంతరం పట్టాభిషేకం కూడా అదే తిథి ఈ కారణంగా నవమి తిథి రామ భక్తులకు అత్యంత పవిత్రమైనది. ఈ ఏడాది ప్రత్యేకత ఏమిటంటే, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పవిత్ర ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీంతో ప్రపంచం నలుమూలలలోని భక్తులు తమ ఇళ్ల నుంచే ఈ ఘట్టాన్ని వీక్షించే అవకాశాన్ని పొందనున్నారు.

సూర్య తిలకం

ఈ శ్రీరామనవమికి మరొక ప్రధాన ఆకర్షణ సూర్య తిలకం. మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు బాలరాముని నుదిటిపై కచ్చితంగా పడతాయి. ఇది దాదాపు నాలుగు నిమిషాల పాటు ఉంటుందని అంచనా. ఈ అపూర్వ దృశ్యాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఇది భక్తి, విజ్ఞానం, శాస్త్రం మేళవించిన అద్భుతం. శ్రీరామనవమి సందర్భంగా అన్ని ఆలయాల్లో శ్రీ సీతారముల కల్యాణం నిర్వహిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య

పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

గ్యాస్ కొరత భయం, ఆన్‌లైన్‌లో ఇండక్షన్ స్టవ్‌లు ఔట్ ఆఫ్ స్టాక్!

గ్యాస్ కొరత భయం, ఆన్‌లైన్‌లో ఇండక్షన్ స్టవ్‌లు ఔట్ ఆఫ్ స్టాక్!

No image

దేశంలో ఇంధన సంక్షోభం ముంచుకొస్తోందని – రాహుల్ గాంధీ హెచ్చరించారు.

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు : స్పీకర్‌ ఓంబిర్లా

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు : స్పీకర్‌ ఓంబిర్లా

గ్యాస్ బుక్ చేశారా? 2 రోజుల్లో రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!

గ్యాస్ బుక్ చేశారా? 2 రోజుల్లో రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?

స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?

పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

📢 For Advertisement Booking: 98481 12870