అంతరిక్ష ప్రయోగాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న యాక్సియం-4 మిషన్ (Axiom-4 Mission) మరోసారి వాయిదా పడింది. రేపు (జూన్ 19) జరగాల్సిన ఈ ప్రయోగాన్ని ఈనెల 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు యాక్సియం స్పేస్ సంస్థ ప్రకటించింది. ప్రయోగానికి వినియోగిస్తున్న ఫాల్కన్-9 రాకెట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల ప్రయోగాన్ని పునఃసమీక్షించి మళ్లీ తేదీ ఖరారు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే అనేకసార్లు ఈ మిషన్ వాయిదా పడడంతో అందర్నీలో ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా లేదా అని మాట్లాడుకుంటున్నారు.
మిషన్ ప్రత్యేకత
ఈ మిషన్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా మొత్తం నలుగురు అంతరిక్షయాత్రికులు భాగంగా ఉన్నారు. వీరు అంతరిక్షంలోకి వెళ్లి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) లో 14 రోజులపాటు పలు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు. ఈ ప్రయోగాలు మానవ శరీరంపై అంతరిక్షం ప్రభావం, నూతన ఔషధాల అభివృద్ధి, వాతావరణ మార్పులు వంటి అంశాలపై దృష్టి సారించనున్నాయి.
రాకెట్ సాంకేతికతపై పూర్తి విశ్వాసం
యాక్సియం-4 మిషన్ వాయిదా వల్ల వ్యోమగాముల అంచనాలు కొంత వెనక్కి వెళ్లినప్పటికీ, ప్రయోగ భద్రతే ప్రాధాన్యమని స్పేస్ సంస్థలు స్పష్టంచేశాయి. రాకెట్ సాంకేతికతపై పూర్తి విశ్వాసం వచ్చిన తర్వాత మాత్రమే ప్రయోగం చేపడతామని చెప్పిన యాక్సియం స్పేస్, ఇప్పటికే అంతరిక్ష ప్రయాణాల్లో ప్రైవేటు రంగానికి గొప్ప అవకాశాలను తెరలేపుతోంది. భారత్ తరఫున శుభాంశు శుక్లా ఈ ప్రయాణంలో భాగమవుతుండటం గర్వకారణంగా మారింది.
Read Also : KTR: కేటీఆర్, అరవింద్ కుమార్ జాయింట్ విచారణకు ఏసీబీ ప్రణాళిక