ఇప్పటి కాలంలో ప్రతి ఇంటిలోనూ ప్లాస్టిక్ ఫుడ్ స్టోరేజ్ కంటైనర్లు అనివార్యమయ్యాయి. పప్పులు, కూరగాయలు, పచ్చళ్లు, ఇతర ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తక్కువ ధర, తేలికపాటు, ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసుకోవడానికి అనువుగా ఉండడం వంటి కారణాల వల్ల చాలా మంది ఇవే బాగా ఉపయోగిస్తున్నారు. అయితే, ప్లాస్టిక్ కంటైనర్లను ఉపయోగించడంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించకపోతే ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్లాస్టిక్ ఫుడ్ కంటైనర్లకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉందా?
చాలా మంది ప్లాస్టిక్ వస్తువులను శాశ్వతంగా ఉపయోగించుకుంటూ ఉంటారు. కానీ ప్లాస్టిక్ ఫుడ్ కంటైనర్లు కూడా శాశ్వతంగా ఉపయోగించలేమని నిపుణులు చెబుతున్నారు. వీటికి కూడా ఒక గడువు ఉంటుంది. ఒకసారి అది పూర్తయితే, వాటిని వాడటం వల్ల హానికరమైన రసాయనాలు ఆహారంలోకి చేరే ప్రమాదం ఉంది. వీటిని వాడడం వెనుక తక్కువ ధరకు లభించడం, తేలికగా ఉండడం, ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయడానికి అనువుగా ఉండడం ఇలా అనేక కారణాలు ఉండొచ్చు. అమెరికాలోని పీడియాట్రిక్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ స్పెషాలిటీ యూనిట్ప్రకారం, ప్లాస్టిక్ కంటైనర్లలో థాలేట్స్, బిస్ఫెనాల్-ఏ అనే రెండు రసాయనాలు ఉంటాయి. హార్మోన్ల అసమతుల్యత- థాలేట్స్, BPA అనే కెమికల్స్ హార్మోన్లపై ప్రభావం చూపుతాయి. ఇవి ఎండోక్రైన్ డిస్రప్టర్లుగా వ్యవహరిస్తాయి. ముఖ్యంగా ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల పనితీరును మారుస్తాయి. పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం- మహిళలలో మరియు పురుషులలో పునరుత్పత్తి వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉంది. పిల్లల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం- ఈ కెమికల్స్ చిన్న పిల్లల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ప్లాస్టిక్ డబ్బాలు వాడుతూ ఉంటే, ఈ ఐదు సంకేతాలు కనిపిస్తే వెంటనే వాటిని బయటకు పారేయడం మంచిది- పగుళ్లు, ఆకార మార్పు – ప్లాస్టిక్ కంటైనర్ వంగినట్లు కనిపించినా, మూత సరిగ్గా పట్టకపోయినా వాడకూడదు. మొండి మరకలు, వాసన మారడం – ఎంత శుభ్రం చేసినా, పాత ఆహారం వాసన వస్తే ప్లాస్టిక్ క్షీణించినట్లు అర్థం. మూత సరిగ్గా పట్టకపోవడం – ఎప్పటిలా టైట్‌గా మూత ఉండకపోతే అది వాడకానికి పనికిరాదు. వీక్షణ మార్పులు – ప్లాస్టిక్ మీద చిన్న గీతలు, రంగు మార్పులు కనిపిస్తే అది చెడిపోయినట్లు భావించాలి. BPA రహితమా లేదా? – పాత ప్లాస్టిక్ డబ్బాలు BPA కలిగి ఉండే అవకాశం ఎక్కువ. కనుక, వాటిని వెంటనే మార్చడం మంచిది. మీరు వాడే ప్లాస్టిక్ కంటైనర్ దిగువన రీసైక్లింగ్ కోడ్‌ని చెక్ చేస్తే అది BPA రహితమైందో లేదో తెలిసిపోతుందంటున్నారు నిపుణులు. గాజు కంటైనర్లు – వీటిలో ఏ రసాయనాల ప్రభావం ఉండదు. స్టీల్ బాక్స్‌లు – ఆహార పదార్థాలు ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉంటాయి. సిలికాన్ స్టోరేజ్ బాక్స్‌లు – వీటిని మైక్రోవేవ్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు. ప్లాస్టిక్ ఫుడ్ స్టోరేజ్ కంటైనర్లు ఉపయోగపడినా, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. పగుళ్లు ఏర్పడినా, వాసన మారినా, మరకలు పడినా, మూత సరిగ్గా కట్టలేకపోయినా వెంటనే వాటిని బయటకు పారేయాలి. ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది.