జేమ్స్ కామెరూన్ ‘అవతార్ 3: ఫైర్ అండ్ యాష్’ – అగ్ని, కొత్త పోరాటాలతో నిండిన సరికొత్త దృశ్యకావ్యం!
హాలీవుడ్ సంచలనం జేమ్స్ కామెరూన్ సృష్టించిన విజువల్ వండర్ ‘అవతార్’ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. పండోరా అనే కల్పిత గ్రహాన్ని, అందులోని ప్రకృతి అందాలను కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్‌తో తీర్చిదిద్ది ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకున్నారు జేమ్స్. ఆ తర్వాత ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’తో మరో అద్భుతమైన అనుభూతిని అందించారు. ఇప్పుడు, ఈ సిరీస్‌లో మూడో భాగాన్ని పంచభూతాలలో ఒకటైన అగ్ని (fire) నేపథ్యంతో ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (Avatar 3) గా రూపొందిస్తున్నారు. గత రెండు చిత్రాలతో పోలిస్తే పార్ట్ 3 మరింత ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు జేమ్స్ కామెరూన్ మొదటి నుంచీ చెబుతూ వస్తున్నారు. ఈ సినిమా ఈ డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, తాజాగా ఓ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ‘అవతార్ 3’ ట్రైలర్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా మరో రెండు రోజుల్లో విడుదల కానున్న ‘ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’ (The Fantastic Four: First Steps) ప్రదర్శించే థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ సినీ లవర్స్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

పార్ట్ 3 లో కొత్త విలన్లు, భిన్నమైన పోరాటాలు!
ఇప్పటివరకు చూసిన రెండు అవతార్ చిత్రాలతో పోలిస్తే ‘అవతార్ 3’ (Avatar 3) ఎంతో ప్రత్యేకంగా ఉండనుంది. తొలి రెండు భాగాలలో జేక్ కుటుంబం మానవ ప్రపంచంతో పోరాటం చేసింది. కానీ పార్ట్ 3లో కథనం పూర్తిగా మారుతుంది. ఇందులో కొత్త విలన్లు పుట్టుకొస్తారు. యాష్ ప్రపంచంలోని తెగలతోనూ జేక్ కుటుంబం పోరాటం చేస్తుంది. మొదటి పార్ట్‌లో భూమి నేపథ్యం, రెండో భాగంలో సముద్రం నేపథ్యం ఉండగా, ఇప్పుడు మూడో భాగంలో చంద్రుడిపై జరిగే యుద్ధాన్ని చూడబోతున్నాం. ఈ సినిమాను కూడా ప్రేక్షకులు తప్పకుండా ఆస్వాదిస్తారని నమ్ముతున్నానని డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఈ మధ్య స్వయంగా వెల్లడించడం విశేషం. ఈ అప్‌డేట్స్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’పై అంచనాలను మరింత పెంచాయి. ‘అవతార్ 3’ ఈ ఏడాది డిసెంబర్ 19న, ‘అవతార్ 4’ 2029లో, చివరిగా రానున్న ‘అవతార్ 5’ డిసెంబర్ 2031లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం గతంలోనే ప్రకటించింది. కామెరూన్ ఈ సారి ఎలాంటి విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారో చూడాలి! ఈ చిత్రం విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అవతార్ 3 సినిమా వస్తుందా?
జూన్ 2023లో, డిస్నీ రాబోయే మూడు అవతార్ సినిమాల విడుదల షెడ్యూల్ మారుతుందని వెల్లడించింది, అవతార్ 3 డిసెంబర్ 2024 నుండి డిసెంబర్ 2025 వరకు ఒక సంవత్సరం పాటు మారడంతో ప్రారంభమవుతుంది. అవతార్ 4 మరియు అవతార్ 5 రెండూ మూడు సంవత్సరాలు మారాయి, అంటే ఈ సిరీస్ 2031 వరకు కొనసాగుతుంది.
అవతార్ 3 విలన్ ఎవరు?
ఫైర్ మరియు యాష్ గురించిన తొలి వివరాలు, న’వి అనే అగ్ని తెగ వారి అడవి మరియు నీటి ప్రతిరూపాల కంటే ఎక్కువ విరోధులు అని సూచిస్తున్నాయి. వారి నాయకురాలిగా, వరంగ్ తన ప్రజల కోపాన్ని రగిలించి, అవతార్ ఫ్రాంచైజీలో మొదటి న’వి విరోధిగా వ్యవహరిస్తుంది.
అవతార్ 3 నుండి అభిమానులు ఏమి ఆశిస్తున్నారు?
ఎంపైర్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, కామెరాన్ అవతార్ 3 లో ఉత్కంఠభరితమైన సాహసాలు, తీవ్రమైన యాక్షన్ సన్నివేశాలు మరియు పాత్ర అభివృద్ధి మరియు కుట్రలలో లోతైన డైవ్ ఉంటుందని వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Son Of Sardaar 2: ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ నుంచి కొత్త ట్రైలర్ రిలీజ్