ఎలాన్ మస్క్ పై రచయిత్రి సంచలన వ్యాఖ్యలు!

ఎలాన్ మస్క్ పై రచయిత్రి సంచలన వ్యాఖ్యలు!

ప్రపంచ కుబేరుడు ,టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా రచయిత్రి ఆష్లీ సెయింట్ 5 నెలల క్రితం ఓ బిడ్డకు జన్మనిచ్చింది .ఆ బిడ్డకు మస్క్ తండ్రి అని x లో సంచలన ప్రకటన విడుదల చేసారు. నా బిడ్డకు మస్క్ 13 వ సంతానమని పేర్కొన్నారు.దీంతో ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది. బిడ్డ భద్రత, తమ గోప్యత వంటి కారణాలతో ఈ విషయాన్ని బయటపెట్టలేదని చెప్పారు. అయితే, కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్ని ప్రచురించే ప్రయత్నం చేస్తుండడంతో అనవసర వివాదానికి తావివ్వకూడదనే ఉద్దేశంతో మస్క్ తో తన బంధాన్ని తానే బయటపెడుతున్నట్లు వివరించారు. మా బిడ్డ ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరగాలని మేం కోరుకుంటున్నాం.మా గోప్యతకు భంగం కలిగించవద్దు అంటూ ఆష్లీ మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆష్లీ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎలాన్ మస్క్ మాత్రం ఇప్పటి వరకూ ఈ విషయంపై స్పందించలేదు.ఎలాన్ మస్క్ కు, మొదటి భార్య జస్టిన్ కు పుట్టిన జేవియర్ అలెగ్జాండర్ కొత్త కాలం క్రిందట అమ్మాయిగా మారారు. ఆయనతో సంబంధం లేకుండా ఉండాలని కోరుకున్నట్లు జేవియర్ తెలిపారు. కుమారుడి చర్య పై కోపంతో ఎలాన్ మస్క్ అమెరికా లోనే ట్రాన్స్ జెండర్స్ కు హక్కులు లేకుండా చేసేందుకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై ఒత్తిడి తీసుకొచ్చారని సమాచారం. ట్రంప్ ట్రాన్స్ జెండర్ ఫైల్ మీద సంతకం చేయడానికి బలమైన కారణంగా చెబుతారు.అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానిమోదీ తో భేటీ లో పాల్గొన్న మస్క్,భార్య 3 పిల్లలు ఉండడం గమనార్హం.

Elon Musk

మొత్తం 13 మంది పిల్లలు సంతానం

మస్క్ వ్యక్తిగత జీవితం గతంలోనూ ఎన్నోసార్లు వార్తల్లో నిలిచింది.మొదటి భార్య జస్టిన్‌తో మొదటి బిడ్డను కోల్పోయిన అనంతరం ఐవీఎఫ్ పద్ధతిలో ఆ దంపతులు ఐదుగురు పిల్లలను పొందారు. ఆ తరువాత 2008 లో విడిపోయారు. బ్రిటన్నటి తాలులాహ్ రిలేను మస్క్ పెళ్లి చేసుకున్నారు. వీరికి పిల్లలు లేరు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ కెనడియన్ సింగర్ గ్రిమ్స్ తో ఉంటున్నారు. వీరికి 3 పిల్లలున్నారు.రీసెంట్ గా తనకు 3 పిల్లలున్నట్లు మస్క్ ప్రకటించారు. ప్రతిష్టాత్మక సంస్థ బ్రెయిన్ టెక్నాలజీ స్టార్ట్ అప్ న్యూరాలింక్ లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ తో 3 పిల్లలకు జన్మనిచ్చినట్లు చెప్పారు. దీంతో ఆయన పిల్లల సంఖ్య 12 కు చేరుకుంది.ఆష్లీ కి పుట్టిన బిడ్డతో కలిపి 13 మంది పిల్లలు ఉన్నట్లు అయ్యింది.

Related Posts
భారత ప్రజాస్వామ్యం పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
భారత ప్రజాస్వామ్యం పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు

భారత్‌లో ప్రజాస్వామ్యం బలంగా ఉందని, దేశంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసి ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నారని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. మ్యూనిచ్‌లో జరిగిన 61వ Read more

జార్జియాలో ఎన్నికల కమిషన్ అధికారిపై నల్లరంగు పెయింట్ విసిరిన సంఘటన..
paint

జార్జియాలో జరిగిన ఎన్నికల వివాదం నేపథ్యంలో, ఎన్నికల కమిషన్ అధికారిపై నల్లరంగు పెయింట్ విసిరిన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన, వివాదాస్పద ఎన్నికల ఫలితాలు మరియు Read more

మోదీకి బార్బడోస్‌ అత్యున్నత పురస్కారం
మోదీకి బార్బడోస్‌ అత్యున్నత పురస్కారం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం లభించింది. బార్బడోస్ దేశం ప్రధాని మోదీకి ప్రతిష్టాత్మకమైన ‘ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడం ఆఫ్ బార్బడోస్’ పురస్కారాన్ని ప్రదానం Read more

Trump Tariff: అమెరికాలో ఆటోమోటివ్ వాహనాలపై భారీగా పన్ను
అమెరికాలో ఆటోమోటివ్ వాహనాలపై భారీగా పన్ను

అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ సంచలన నిర్ణయాలను తీసుకుంటోన్నారు డొనాల్డ్ ట్రంప్. టారిఫ్‌తో బెంబేలెత్తిస్తోన్నారు. భారత్ సహా పలు దేశాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవే Read more