tdp mla kolikapudi

గిరిజన మహిళపై దాడి.. టీడీపీకి కొలికపూడి వివరణ

తిరువూరులో ఓ గిరిజన మహిళపై దాడి చేసి అవమానించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇవాళ పార్టీ అధిష్టానానికి వివరణ ఇచ్చారు. కొలికపూడిపై వచ్చిన ఆరోపణలపై అధిష్టానం గతంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని కోరింది. దీంతో ఆయన ఇవాళ పార్టీ పెద్దల ముందు హాజరై రాతపూర్వక వివరణ ఇచ్చారు. దీనిపై విచారించి కొలికపూడిపై తదుపరి చర్యల్ని అధిష్టానం ఖరారు చేయబోతోంది. తిరువూరు నియోజకవర్గంలోని ఎ. కొండూరు మండలం గోపాలపురంలో టీడీపీ గ్రామ కార్యదర్శి భూక్యా రాంబాబు ఇంటికి ఈ నెల 11న వెళ్లిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్.. ఆయన సోదరుడు అయిన వైసీపీ నేత భూక్యా కృష్ణకు చెందిన భూ వివాదంపై హెచ్చరికలు జారీ చేశారు. అంతటితో ఆగకుండా కృష్ణ భార్యను సైతం ఇంట్లో దూరి కొట్టి అవమానించారని ప్రత్యర్థులు ఆరోపించారు. దీనిపై టీడీపీ హైకమాండ్ కొలికపూడి వివరణ కోరింది. ఈ వ్యవహారంపై ఇవాళ టీడీపీ క్రమశిక్షణా కమిటీ ముందు హాజరైన కొలికపూడి.. రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వచ్చేది వేరని, వాస్తవం వేరని తెలిపారు.

Advertisements
Related Posts
మోదీకి కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు
మోదీకి కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు

విశాఖ ఉక్కు కర్మాగారానికి మద్దతు ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు శాఖ Read more

CM Chandrababu : పాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మృతి పై విచారణకు సీఎం ఆదేశం
పాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మృతి పై విచారణకు సీఎం ఆదేశం

CM Chandrababu: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నవిషయం తెలిసిందే. అయితే ప్రవీణ్ పగడాల మృతిపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు విచారం Read more

మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు
kodalinani

వైసీపీ నేతలపై , వైసీపీ సోషల్ మీడియా వారిపై వరుసగా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన ఐదేళ్ల వైసీపీ హయాంలో చేసిన అక్రమాలకు , Read more

తండ్రి తిన్న ప్లేట్ ను తీసి శభాష్ అనిపించుకున్న నారా లోకేష్
naralokeshWell done

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శనివారం బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు Read more