బిహార్‌లోని గయా జిల్లాలో (In Gaya district of Bihar) ఓ పాఠశాల ప్రాంగణం లో ఘోరంగా మారిపోయింది. ఐదో తరగతి విద్యార్థుల మధ్య జరిగిన చిన్న గొడవ, చివరకు ఉపాధ్యాయుడిపై హింసాత్మక దాడిగా మారింది. ఇది పాఠశాల విద్యార్థుల్లో భయాన్ని రేకెత్తించింది.ఒకే తరగతిలో ఉన్న ఇద్దరు విద్యార్థులు తరగతి సమయంలో గొడవపడ్డారు. రాకేశ్ రంజన్ శ్రీవాస్తవ అనే ఉపాధ్యాయుడు వారిద్దరినీ సమాధానంగా చేయడానికి వారిని వదిలించి ఒకరికి చెంపదెబ్బ కొట్టాడు. అదే సమస్యగా మారింది.
కుటుంబ సభ్యుల దూకుడు…పాఠశాలలో ఉద్ధృతం
అతనిపై చెంపదెబ్బ వేసినట్టు విన్న విద్యార్థి తల్లిదండ్రులు (Student’s parents), కుటుంబ సభ్యులు వెంటనే స్కూల్‌లోకి చొరబడ్డారు. ఎలాంటి భయమూ లేకుండా, అందరి ముందే టీచర్ రాకేశ్‌పై పిడిగుద్దులు, కర్రలతో దాడి చేశారు. చూడటానికి వచ్చిన మరో ఉపాధ్యాయుడు ధర్మేంద్ర కుమార్ కూడా బలయ్యాడు.ఈ హఠాత్ దాడితో స్కూల్‌లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. చిన్న పిల్లలు తరగతి గదుల్లోకి పరిగెత్తి తలదాచుకున్నారు. కొందరైతే ఏడుస్తూ బయటకు పరుగులు పెట్టారు. ఘటన చూసిన విద్యార్థులు తీవ్రంగా భయపడ్డారు.
పోలీసులు రంగంలోకి… ఉపాధ్యాయులకు చికిత్స
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్కూల్‌కు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన ఉపాధ్యాయులను ఆసుపత్రికి తరలించారు. రాకేశ్ చేతికి, నడుము భాగానికి గాయాలు అయ్యాయని సమాచారం.బాధిత ఉపాధ్యాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హెడ్‌మాస్టర్ పంకజ్ కుమార్ మాట్లాడుతూ – “ఇది ఒక్క టీచర్‌పైనే కాదు, మొత్తం విద్యావ్యవస్థపై దాడి” అని వ్యాఖ్యానించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Also : Revanth Reddy : జయశంకర్ వర్సిటీలో చెట్ల తొలగింపుపై దుమారం