At present youth are inclined towards IT jobs .. CM revanth reddy

ప్రస్తుతం యువత ఐటీ ఉద్యోగాలవైపే మొగ్గు : సీఎం

దేశ రక్షణ కోసం అవసరమైన ఇంజినీర్లను తయారుచేయడం మరింత ముఖ్యం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి గచ్చిబౌలి స్టేడియంలో డీఆర్‌డీవో ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విజ్ఞాన్ వైభవ్‌’ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..దేశ రక్షణ బాధ్యత యువతపైనే ఉందని అన్నారు. దేశ రక్షణలో తెలంగాణ పాత్ర కీలకంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఏటా లక్షకుపైగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ చదివి, అమెరికాకు వెళ్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వారిలో దేశభక్తితో, దేశ రక్షణ ప్రాధాన్యతనలు వివరించడానికి ఈ వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నామని అన్నారు.

Advertisements
ప్రస్తుతం యువత ఐటీ ఉద్యోగాలవైపే

బీడీఎల్‌, హెచ్‌ఏఎల్‌, మిధాని వంటి కీలక సంస్థలు

తెలంగాణ నుంచి కేవలం ఐటీ ప్రొఫెషనల్స్ మాత్రమే అమెరికాకు వెళ్లకుండా, దేశ రక్షణ రంగానికి అవసరమైన సమర్థవంతమైన ఇంజినీర్లు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీడీఎల్‌, హెచ్‌ఏఎల్‌, మిధాని వంటి కీలక సంస్థలు హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సైన్స్‌ ప్రదర్శన వల్ల విద్యార్థులు, యువతకు దేశరక్షణ పట్ల అవగాహన కలుగుతుందన్నారు. దేశ రక్షణ కోసం అవసరమైన ఇంజినీర్లను తయారుచేయడం మరింత ముఖ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

రక్షణ రంగంలో భారతదేశాన్ని నంబర్

ప్రస్తుతం యువత ఐటీ ఉద్యోగాలవైపే మొగ్గు చూపుతోందని.. సంప్రదాయ ఇంజినీరింగ్‌ విద్యపై కూడా విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సీఎం సూచించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఏటా లక్షకుపైగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ చదివి, అమెరికాకు వెళ్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వారిలో దేశభక్తితో, దేశ రక్షణ ప్రాధాన్యతనలు వివరించడానికి ఈ వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నామని అన్నారు. రక్షణ రంగంలో భారతదేశాన్ని నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లేందుకు తాము ప్రయత్నిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Related Posts
నేటి నుండి ట్రాఫిక్‌ విధుల్లో ట్రాన్స్‌జెండర్లు
Transgender on traffic duty from today

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగంలో సోమవారం నుంచి ట్రాన్స్‌జెండర్లు విధులు నిర్వహించనున్నారని నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని కమాండ్‌ అండ్‌ Read more

రేవంత్‌ గాలి మాటలకు జవాబు చెప్పాలా? : కిషన్ రెడ్డి
Kishan Reddy comments on cm revanth reddy

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గాలి మాటలకు సమాధానం చెప్పాలా Read more

Donald Trump : డొనాల్డ్‌ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ
Another setback for Donald Trump

America : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా మిలిటరీ విభాగంలో ట్రాన్స్‌జెండర్ల నియామకాన్ని ట్రంప్ నిషేధిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. Read more

జ‌న్వాడ ఫామ్ హౌస్ కేసు.. పోలీసుల విచారణకు రాజ్‌పాకల
Janwada farmhouse case. Raj Pakala to police investigation

హైదరాబాద్‌: జ‌న్వాడ ఫామ్ హౌస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఈరోజు మోకిల పోలీసుల ముందు విచారణకు Read more

Advertisements
×