దేశ రక్షణ కోసం అవసరమైన ఇంజినీర్లను తయారుచేయడం మరింత ముఖ్యం
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి గచ్చిబౌలి స్టేడియంలో డీఆర్‌డీవో ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విజ్ఞాన్ వైభవ్’ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..దేశ రక్షణ బాధ్యత యువతపైనే ఉందని అన్నారు. దేశ రక్షణలో తెలంగాణ పాత్ర కీలకంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఏటా లక్షకుపైగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ చదివి, అమెరికాకు వెళ్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వారిలో దేశభక్తితో, దేశ రక్షణ ప్రాధాన్యతనలు వివరించడానికి ఈ వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నామని అన్నారు.

బీడీఎల్, హెచ్‌ఏఎల్, మిధాని వంటి కీలక సంస్థలు
తెలంగాణ నుంచి కేవలం ఐటీ ప్రొఫెషనల్స్ మాత్రమే అమెరికాకు వెళ్లకుండా, దేశ రక్షణ రంగానికి అవసరమైన సమర్థవంతమైన ఇంజినీర్లు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీడీఎల్, హెచ్‌ఏఎల్, మిధాని వంటి కీలక సంస్థలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సైన్స్ ప్రదర్శన వల్ల విద్యార్థులు, యువతకు దేశరక్షణ పట్ల అవగాహన కలుగుతుందన్నారు. దేశ రక్షణ కోసం అవసరమైన ఇంజినీర్లను తయారుచేయడం మరింత ముఖ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
రక్షణ రంగంలో భారతదేశాన్ని నంబర్
ప్రస్తుతం యువత ఐటీ ఉద్యోగాలవైపే మొగ్గు చూపుతోందని.. సంప్రదాయ ఇంజినీరింగ్ విద్యపై కూడా విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సీఎం సూచించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఏటా లక్షకుపైగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ చదివి, అమెరికాకు వెళ్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వారిలో దేశభక్తితో, దేశ రక్షణ ప్రాధాన్యతనలు వివరించడానికి ఈ వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నామని అన్నారు. రక్షణ రంగంలో భారతదేశాన్ని నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లేందుకు తాము ప్రయత్నిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.