Today Rasi Phalalu : రాశి ఫలాలు – 09 డిసెంబర్ 2025 Horoscope in Telugu

Read Time:  1 min
Today Rasi Phalalu
Today Rasi Phalalu
FONT SIZE
GET APP

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 09 డిసెంబర్ 2025 Horoscope in Telugu – Vaartha Telugu

Aries

మేష రాశి

దీర్ఘకాలంగా మీను ఇబ్బంది పెట్టిన కొన్ని సమస్యలు చివరికి పరిష్కారం వైపు అడుగులు వేస్తాయి. ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన ఈ ఉరట మీ మనసుకు నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది.

…ఇంకా చదవండి
Taurus

వృషభరాశి

దూరప్రాంతాల్లో ఉన్న స్నేహితులు లేదా బంధువుల నుండి మంచి వార్తలతో పాటు రుచికరమైన ఆహార వంటకాలు అందే సూచనలు ఉన్నాయి.

…ఇంకా చదవండి
Gemini

మిథున రాశి

ఈరోజు మీ వ్యక్తిత్వం, మాట్లాడే తీరు అంతా కలిసి శత్రువులుగా భావించిన వారినే మీకు మిత్రులుగా మార్చే పరిస్థితులు ఏర్పడతాయి. పాత అపార్థాలు తొలగి, కొత్తగా విశ్వాసం పెరిగే అవకాశం ఉంది.

…ఇంకా చదవండి
Cancer

కర్కాటక రాశి

ఈరోజు మీరు కొత్త ఋణాలు లేదా ఆర్థిక ఒప్పందాలను తీసుకునే అవకాశం ఉంటుంది. అవసరానికి తగ్గట్లు ప్లాన్ చేసి అడుగులు వేస్తే తరువాత మంచి ప్రయోజనం దక్కుతుంది.

…ఇంకా చదవండి
Leo

సింహ రాశి

ఈరోజు నీటి వల్ల కొన్ని అడ్డంకులు రావచ్చు. ప్రయాణాల సమయంలో, ఇంటి పనుల్లో లేదా వాతావరణ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది.

…ఇంకా చదవండి
Virgo

కన్యా రాశి

ఎప్పటికీ ఎదుగుదలకు అడ్డుగా నిలిచే అలవాట్లను మార్చి, పద్ధతిగా ముందుకు సాగాలని ప్రయత్నించాలి. మీ క్రమశిక్షణే మీ అభివృద్ధికి దారి తీస్తుంది.

…ఇంకా చదవండి
Libra

తులా రాశి

ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మీకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మీరు చేసిన కృషికి సరైన గుర్తింపు దక్కుతుంది. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు మీ ప్రతిష్టను మరింత పెంచుతాయి.

…ఇంకా చదవండి
Scorpio

వృశ్చిక రాశి

మీరు ఎంత కష్టపడి పనిచేస్తారో, ఆ మేరకు ఫలితాలు కూడా అనుకూలంగానే దక్కుతాయని నేటి రోజు తెలియజేస్తోంది. మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు మరియు మీ చర్యలకు విశ్వాసం పెరుగుతుంది.

…ఇంకా చదవండి
Sagittarius

ధనుస్సు రాశి

ఇష్టం లేకపోయినా, పరిస్థితుల దెబ్బకు కొంతమందితో కలిసి పనిచేయాల్సిన అవసరం రావచ్చు. మీ అభిరుచికి విరుద్ధంగా ఉన్నప్పటికీ, తాత్కాలిక ప్రయోజనాల కోసం మీరు తీసుకునే ఈ నిర్ణయం తరువాత మంచిదే

…ఇంకా చదవండి
Capricorn

మకర రాశి

ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో కొంత ఆలస్యం, చిన్నచిన్న అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ ప్లాన్లు అనుకున్నంత సాఫీగా సాగకపోవడం వల్ల చిరాకు లేదా అలసట కలగొచ్చు.

…ఇంకా చదవండి
Aquarius

కుంభ రాశి

ఈరోజు మీరు పట్టుదలతో ముందుకు సాగితే ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొంతకాలంగా నిలిచిపోయిన విషయాలు కూడా మీ నిర్ణయాత్మక ధోరణితో పూర్తి దిశగా కదులుతాయి.

…ఇంకా చదవండి
Pisces

మీన రాశి

ఈరోజు కొత్త వస్త్రాలు, గృహం లేదా స్థలం వంటి పెద్ద కొనుగోళ్లు చేయాలని అనిపించవచ్చు. అయితే కొన్ని కారణాల వల్ల ఇవి తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం ఉంది.త్వరపడకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచిదే.

…ఇంకా చదవండి
Sun

వారం – వర్జ్యం

తేది : 09-12-2025,మంగళవారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, మార్గశిర మాసం(Margashira Masam), దక్షిణాయణం శరద్ ఋతువు, శుక్లపక్షం(Shukla Paksham)

పంచమి మ.2.35, ఆశ్లేష రా.2.26 ,జ్యేష్ఠ కార్తె
వర్జ్యం: మ.2.37-4.14
దు.ము : ఉ.8.40 – 9.25 , రా.10.04 – 10.49
శుభముహూర్తం: ఉ.10.15 – 11.00
రాహుకాలం: మ.3.00-4.30

Uday Kumar

రచయిత గురించి

Uday Kumar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.