Today Rasi Phalalu : రాశి ఫలాలు – 01 మార్చి 2026

Read Time:  1 min
Today Rasi Phalalu
Today Rasi Phalalu
FONT SIZE
GET APP

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 01 మార్చి 2026

మేష రాశి

కుటుంబంలోని పెద్దలు, వృద్ధులు పదేపదే సూచనలు చేస్తూ కొంత విసుగును కలిగించే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్లను ఎదిరించలేని స్థితి ఉన్నప్పటికీ సహనంతో వ్యవహరించడం మంచిది.

…ఇంకా చదవండి

వృషభ రాశి

ఇతరుల సలహాలు, అతి జాగ్రత్తలు కొంత విసుగు పుట్టించే పరిస్థితులు ఏర్పడుతాయి. అయినప్పటికీ ఓర్పుతో వ్యవహరిస్తే అనవసర వివాదాలు తప్పించుకోవచ్చు. నిజమైన మిత్రులెవరో, శత్రువులెవరో స్పష్టంగా అర్థమయ్యే సందర్భాలు ఎదురవుతాయి.

…ఇంకా చదవండి

మిథున రాశి

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆచితూచి ప్రణాళికను రూపొందిస్తారు. తొందరపాటు నిర్ణయాలను దూరం పెట్టి ప్రతి విషయాన్ని విశ్లేషిస్తూ ముందుకు సాగుతారు.అభివృద్ధి దిశగా స్పష్టమైన ఆలోచనలతో కృషి ప్రారంభిస్తారు.

…ఇంకా చదవండి

కర్కాటక రాశి

ఆధ్యాత్మిక విషయాలలో ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తారు. ఆలయ దర్శనాలు లేదా ధ్యానం వంటి కార్యక్రమాల ద్వారా మనశ్శాంతి పొందుతారు. అంతర్ముఖత పెరిగి జీవిత లక్ష్యాలపై స్పష్టత ఏర్పడుతుంది.

…ఇంకా చదవండి

సింహ రాశి

వాయిదా పడుతున్న కోర్టు వ్యవహారాలు పరిష్కారదశకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకాలంగా ఆగిపోయిన పనులు మళ్లీ ముందుకు కదులుతాయి. న్యాయపరమైన విషయాలలో మీకు అనుకూలమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

…ఇంకా చదవండి

కన్యా రాశి

బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ మీపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. అప్పగించిన పనులను సమయానికి పూర్తి చేయడం ద్వారా విశ్వాసాన్ని పెంపొందిస్తారు. మీ క్రమశిక్షణ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది.

…ఇంకా చదవండి

తులా రాశి

వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు క్రమంగా తొలుగుతాయి. ఇంతకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం అందుకుంటాయి. మీ ప్రయత్నాలకు అనుకూల ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది.

…ఇంకా చదవండి

వృశ్చిక రాశి

మొండి బాకీలు వసూలవుతాయి. ఇంతకాలంగా నిలిచిపోయిన మొత్తాలు చేతికి వచ్చి ఆర్థికంగా ఊరటనిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో ధైర్యంగా ముందుకు సాగితే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

…ఇంకా చదవండి

ధనుస్సు రాశి

కొత్త వ్యాపార, విద్యా సంబంధితమైన విషయాలకు శ్రీకారం చుట్టడానికి ఇది అనుకూలమైన సమయం. గృహ కార్యక్రమాలను ప్రారంభించుటకు మంచి సూచనలు కనిపిస్తున్నాయి. పెద్దల సలహాలతో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మేలుకలిగిస్తాయి.

…ఇంకా చదవండి

మకర రాశి

స్నేహితుల సహకారం పూర్తిగా లభించుటవలన మీరు చేపట్టిన కొన్ని కార్యక్రమాలలో విజయాన్ని చవిచూస్తారు. సమయానికి అందిన మద్దతు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సమూహంగా చేసిన పనులు మంచి ఫలితాలను అందిస్తాయి.

…ఇంకా చదవండి

కుంభ రాశి

అధికారుల అండదండలు లభించుట వలన వృత్తి యందు రాణించ గలుగుతారు. మీ పనితీరుకు ఉన్నతాధికారుల ప్రశంసలు దక్కే అవకాశం ఉంది. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి.

…ఇంకా చదవండి

మీన రాశి

ఆస్తి విషయంలో ఒప్పందాలు కుదురుతాయి. ఇంతకాలంగా కొనసాగుతున్న చర్చలు సానుకూలంగా ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. భూమి, గృహ సంబంధిత వ్యవహారాలలో స్పష్టత ఏర్పడుతుంది.

…ఇంకా చదవండి
Sun

వారం – వర్జ్యం

తేది : 01-03-2026,ఆదివారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఫాల్గుణమాసం , ఉత్తరాయణం శిశిర ఋతువు, శుక్లపక్షం శతభిషం కార్తె

త్రయోదశి రా.7.12, పుష్యమి ఉ.8.35
వర్జ్యం: రా.9.00 – 10.33
దు.ము : సా.4.37-5.24
శుభముహూర్తం : ఉ.6.30-7.30, సా.6.30-7.00
రాహుకాలం: సా.4.30 – 6.00

Uday Kumar

రచయిత గురించి

Uday Kumar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.