Assembly sessions to resume

తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్‌: ఈ నెల 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ, సోమవారం వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలను వారం రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. సోమవారం ఉదయం సమావేశాలు పునఃప్రారంభమైన తర్వాత తొలుత సభ్యుల మౌఖిక ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. అనంతరం బీఏసీ (బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ) సమావేశం కానున్నది. సభను ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే బిల్లులు ప్రవేశపెట్టాలి? వంటి అంశాలపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సభ సమావేశాలను వారంపాటు నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం.

ఈ రోజు ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాల అనంతరం పలు సంతాప తీర్మానాలను ప్రవేశపెడతారు. ఆ తర్వాత, తెలంగాణ యువ భారత వ్యాయామ విద్య, క్రీడా విశ్వవిద్యాలయం బిల్లు, తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చను చేపడతారు. శాసనమండలిలో కూడా ఇదే అంశంపై చర్చ జరగనుంది. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ వ్యవహారాలు సహా పలు శాఖల బిల్లులు సభకు వచ్చే అవకాశాలున్నట్టు తెలిసింది.

కాగా, గత సోమవారం సమావేశాల ప్రారంభం రోజే తెలంగాణతల్లి నూతన విగ్రహం, రూపురేఖలు వంటి అంశాలపై సభలో చర్చించారు. అయితే, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ సభ్యులను ఉభయసభల్లోకి ఉద్దేశపూర్వకంగానే రాకుండా చేసి, ప్రభుత్వం చర్చ పెట్టిందనే విమర్శలు వినిపించాయి. తెలంగాణ ప్రజలు ఆరాధించిన తల్లిని కాదని, అభయహస్తం తల్లిని ఉద్దేశపూర్వకంగా రుద్దాలనే కుట్రను ప్రభుత్వం చేసిందని, ఆ బండారం అంతా తాము బయటపెడతామనే భయంతోనే తమను ముందస్తుగానే సభకు రాకుండా అరెస్టు చేయించిందని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్నది.

Related Posts
మోడీ-రేవంత్ భేటీపై బీఆర్ఎస్ విమర్శలు
Revanth Reddy meets PM Modi

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ భేటీపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌కు ఒకరోజు ముందే ఈ Read more

కాంతార చిత్ర బృందానికి ఊరట
కాంతార చిత్ర బృందానికి ఊరట,

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న రిషబ్ శెట్టి సినిమా ‘కాంతార: చాప్టర్ 1’ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకుంది. హాసన్ జిల్లా సకలేష్‌పూర్ తాలూకాలోని Read more

ఎస్ఎల్‌బీసీ సొరంగం నుండి వెనక్కి వచ్చిన రక్షణ సిబ్బంది
కష్టంగా కొనసాగుతున్నరెస్క్యూ ఆపరేషన్

ఎస్ఎల్‌బీసీ సొరంగంలో మట్టి, బురద కారణంగా సహాయక చర్యలు కష్టతరమవుతున్నాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) మరియు ఎన్జీఆర్ఎఫ్ నిపుణులు, ఈ ప్రాంతాన్ని అధ్యయనం చేసి, Read more

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన..
modi putin

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు రానున్నారు. ఈ పర్యటన గురించి క్రెమ్లిన్ ప్రెస్ కార్యదర్శి డిమిత్రి పెస్కోవ్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం, పుతిన్ పర్యటనకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *