Assembly secretary notices to MLAs who have changed parties.

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు.. !

హైదరాబాద్‌: పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రెటరీ నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసులు జారీ అయిన నేపథ్యంలోనే…పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలు కంగుతిన్నారు. నోటీసులకు వివరణ ఇవ్వడానికి సమయం కావాలని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సెక్రెటరీ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు. లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. మరి దీనిపై పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలు ఎలా ముందుకు వెళతారో చూడాలి.

Advertisements
image

కాగా, 2023అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో 10 మంది కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద వారిని అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. సింగిల్ జడ్జి తీర్పుపై శాసనసభ కార్యదర్శి హైకోర్టు ప్రత్యేక బెంచ్‌ను ఆశ్రయించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పుడైనా చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉందని, దీనికి కాలపరిమితి లేదని ప్రత్యేక బెంచ్ తీర్పు ఇచ్చింది. అయితే, స్పీకర్ ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ హైకమాండ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించి కూడా ఆరు నెలలు గడిచినా స్పీకర్ ఇంకా ఎటువంటి చర్య తీసుకోలేదని పిటిషనర్ ఎత్తి చూపారు. కనీసం వాళ్లు నోటీసు కూడా ఇవ్వలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేశం మేఘ చంద్ర కేసులో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేయాలని బిఆర్‌ఎస్ పార్టీ కోరుతోంది. ఎమ్మెల్యేలపై ఆయా పార్టీలు దాఖలు చేసిన ఫిర్యాదులపై స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయం ప్రకటించాలని కేశం మేఘ చంద్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని బిఆర్‌ఎస్ తెలిపింది. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తదుపరి విచారణలో కీలక నిర్ణయాలను సుప్రీంకోర్టు తీసుకునే అవకాశం ఉంది.

Related Posts
అల్లు అర్జున్ హైకోర్టులో అత్యవసర పిటిషన్
TS High Court 1

అరెస్ట్ నేపథ్యంలో సినీ నటుడు అల్లు అర్జున్ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే క్వాష్ పిటిషన్ దాఖలు చేశామని, దీనిని అత్యవసరంగా విచారించాలని కోరారు. Read more

CPS: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఆర్థిక చర్యల ద్వారా, సీపీఎస్ ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. గతంలో Read more

Chandrababu: 27వ తేదీన పోలవరం సందర్శించనున్న చంద్రబాబు
27వ తేదీన పోలవరం సందర్శించనున్న చంద్రబాబు

ఏలూరు/ పోలవరం ప్రభాతవార్త: రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఈనెల 27వ తేదీన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల పరిశీలన చేసేందుకు విచ్చేయుచున్న దృష్ట్యా ముఖ్యమంత్రి పర్యటనా Read more

Myanmar earthquake : భూకంపం ధాటికి మయన్మార్ లో 25 మంది మృతి
Myanmar earthquake : భూకంపం ధాటికి మయన్మార్ లో 25 మంది మృతి

Myanmar earthquake : భూకంపం ధాటికి మయన్మార్ లో 25 మంది మృతి మయన్మార్ భారీ భూకంపం ధాటికి కుదేలైంది. రిక్టర్ స్కేల్ పై 7.7 తీవ్రతతో Read more

Advertisements
×