हिन्दी | Epaper
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు.. !

sumalatha chinthakayala
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు.. !

హైదరాబాద్‌: పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రెటరీ నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసులు జారీ అయిన నేపథ్యంలోనే…పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలు కంగుతిన్నారు. నోటీసులకు వివరణ ఇవ్వడానికి సమయం కావాలని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సెక్రెటరీ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు. లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. మరి దీనిపై పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలు ఎలా ముందుకు వెళతారో చూడాలి.

image

కాగా, 2023అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో 10 మంది కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద వారిని అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. సింగిల్ జడ్జి తీర్పుపై శాసనసభ కార్యదర్శి హైకోర్టు ప్రత్యేక బెంచ్‌ను ఆశ్రయించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పుడైనా చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉందని, దీనికి కాలపరిమితి లేదని ప్రత్యేక బెంచ్ తీర్పు ఇచ్చింది. అయితే, స్పీకర్ ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ హైకమాండ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించి కూడా ఆరు నెలలు గడిచినా స్పీకర్ ఇంకా ఎటువంటి చర్య తీసుకోలేదని పిటిషనర్ ఎత్తి చూపారు. కనీసం వాళ్లు నోటీసు కూడా ఇవ్వలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేశం మేఘ చంద్ర కేసులో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేయాలని బిఆర్‌ఎస్ పార్టీ కోరుతోంది. ఎమ్మెల్యేలపై ఆయా పార్టీలు దాఖలు చేసిన ఫిర్యాదులపై స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయం ప్రకటించాలని కేశం మేఘ చంద్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని బిఆర్‌ఎస్ తెలిపింది. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తదుపరి విచారణలో కీలక నిర్ణయాలను సుప్రీంకోర్టు తీసుకునే అవకాశం ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో ఓటుతో మారిన పాలన చిత్రపటం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో ఓటుతో మారిన పాలన చిత్రపటం

ఎన్నికల్లో ఓడిపోవడం తో మీసాలు తీయించుకున్న కార్యకర్త

ఎన్నికల్లో ఓడిపోవడం తో మీసాలు తీయించుకున్న కార్యకర్త

బాలు విగ్రహ ఏర్పాటుకు మరో ప్లేస్ చూసుకోవాలి – కవిత

బాలు విగ్రహ ఏర్పాటుకు మరో ప్లేస్ చూసుకోవాలి – కవిత

కేసీఆర్ సంచలన ప్రకటన , 19న కీలక భేటీ…

కేసీఆర్ సంచలన ప్రకటన , 19న కీలక భేటీ…

మరో ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధం.. రంగంలోకి కేసీఆర్!

మరో ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధం.. రంగంలోకి కేసీఆర్!

రేవంత్ రెడ్డి ఫిట్‌నెస్‌పై సోదరుడు కొండల్ రెడ్డి ప్రశంసలు

రేవంత్ రెడ్డి ఫిట్‌నెస్‌పై సోదరుడు కొండల్ రెడ్డి ప్రశంసలు

సీఎం రేవంత్ మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్

సీఎం రేవంత్ మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్

HYDలో జరిగిన మెస్సీ టూర్‌పై నాగవంశీ ప్రశంసలు

HYDలో జరిగిన మెస్సీ టూర్‌పై నాగవంశీ ప్రశంసలు

ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం అవసరమని సూచన

ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం అవసరమని సూచన

తెలంగాణ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాO: రేవంత్ రెడ్డి

తెలంగాణ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాO: రేవంత్ రెడ్డి

హరీశ్‌రావు విషయంలో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి: మహేశ్ కుమార్ గౌడ్

హరీశ్‌రావు విషయంలో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి: మహేశ్ కుమార్ గౌడ్

ఎన్నికల వేళ విషాదం: రోడ్డు ప్రమాదాల్లో 6 మంది మృతి

ఎన్నికల వేళ విషాదం: రోడ్డు ప్రమాదాల్లో 6 మంది మృతి

📢 For Advertisement Booking: 98481 12870