हिन्दी | Epaper
మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్

Latest News: Asia Cup 2025 – IND vs PAK మళ్లీ మ్యాచ్ ఎప్పుడంటే?

Anusha
Latest News: Asia Cup 2025 – IND vs PAK మళ్లీ మ్యాచ్ ఎప్పుడంటే?

ఆసియా కప్ 2025  (Asia Cup 2025) లో క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా–పాకిస్థాన్ పోరుకు మరోసారి రంగం సిద్ధమైంది.టోర్నమెంట్ ప్రారంభం నుంచే ఈ రెండు జట్ల మధ్య పోరు ఎప్పుడు జరుగుతుందా అన్న అంచనాలు ఊపందుకున్నాయి. సూపర్–4 దశలో భాగంగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ఈ నెల 21వ తేదీ ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ పోరులో విజయం సాధించిన జట్టు ఫైనల్‌కు చేరే అవకాశాలు మరింత బలపడతాయని క్రీడాభిమానులు భావిస్తున్నారు.

యూఏఈ (UAE) తో బుధవారం జరిగిన కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘన విజయం సాధించడంతో ఈ ఆసక్తికర పోరు ఖరారైంది.సూపర్ 4కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 41 పరుగుల తేడాతో యూఏఈని ఓడించింది. ఈ విజయంతో గ్రూప్-ఏ నుంచి భారత్ తర్వాత సూపర్ 4 దశకు అర్హత సాధించిన రెండో జట్టుగా నిలిచింది. ఇప్పటికే పాకిస్థాన్, యూఏఈలపై విజయాలు సాధించి టీమిండియా సూపర్ 4 బెర్తును ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే.

Asia Cup 2025
Asia Cup 2025

యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ (Pakistan) కాస్త తడబడింది. అయితే, చివర్లో పేసర్ షాహీన్ అఫ్రిది (Shaheen Afridi) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో మెరుగైన స్కోరు సాధించగలిగింది. అనంతరం లక్ష్య ఛేదనలో యూఏఈ గట్టిగానే పోరాడినా, కీలక దశలో చేతులెత్తేసింది. కేవలం 20 పరుగుల వ్యవధిలోనే చివరి 7 వికెట్లను కోల్పోయి 105 పరుగులకు ఆలౌట్ అయింది.

కాగా, మ్యాచ్ రిఫరీపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) (PCB) చేసిన ఫిర్యాదుకు సంబంధించిన వివాదంతో ఈ మ్యాచ్ గంటకు పైగా ఆలస్యంగా మొదలైంది. ఈ తాజా ఫలితంతో గ్రూప్-ఏలో భారత్ అగ్రస్థానంలో, పాకిస్థాన్ రెండో స్థానంలో నిలవడం దాదాపు ఖాయమైంది. దీంతో ఆదివారం జరగనున్న సూపర్ 4 పోరులో ఈ రెండు చిరకాల ప్రత్యర్థులు మరోసారి అమీతుమీ తేల్చుకోనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/asia-cup-2025-pakistan-win-over-uae/international/549470/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870