हिन्दी | Epaper
మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్

Latest News: Asia Cup 2025 – ఐపీఎల్ జట్లు కూడా పాక్ ను ఓడించగలవు: మాజీ క్రికెటర్

Anusha
Latest News: Asia Cup 2025 – ఐపీఎల్ జట్లు కూడా పాక్ ను ఓడించగలవు: మాజీ క్రికెటర్

ఆసియా కప్ 2025 (Asia cup 2025) లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌ ఎప్పటిలాగే అభిమానుల్లో విశేష ఆసక్తిని రేపింది. రెండు జట్ల మధ్య జరిగే ప్రతి పోటీ క్రికెట్ మాత్రమే కాకుండా భావోద్వేగాలకు, గర్వానికి ప్రతీకగా మారిపోతుంది. ఈసారి కూడా అదే స్థాయి హైప్ ఉండగా, చివరికి టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించిన భారత ఆటగాళ్లు, పాక్ జట్టును చిత్తు చేశారు.

ఈ విజయం తర్వాత భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా పాక్ జట్టు (Pakistan team) ప్రదర్శనపై అభిమానులు, విశ్లేషకులు సోషల్ మీడియాలో విమర్శలు కురిపిస్తున్నారు. అంచనాలకు తగ్గట్టుగా ఆడలేకపోవడమే కాకుండా, ముఖ్యమైన సమయంలో తడబడటం పాక్ జట్టు వైఫల్యానికి కారణమని అనేక మంది అభిప్రాయపడ్డారు.

ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ

ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ పాకిస్థాన్ జట్టును తీవ్రంగా ఏకిపారేశారు. ఈ వ్యాఖ్యలు తరచూ భారత జట్టుపై విమర్శలు చేసే షాహిద్ అఫ్రిదికి గట్టి సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) పాకిస్థాన్ జట్టు బలహీనతను ఎత్తి చూపారు. భారతదేశంలో ఉన్న చాలా డొమెస్టిక్ జట్లు.. ఉదాహరణకు ముంబై, పంజాబ్ వంటి జట్లు కూడా పాకిస్థాన్ జట్టును ఓడించగలవని ఆయన అన్నారు.

Asia Cup 2025
Asia Cup 2025

అంతే కాకుండా చాలా ఐపీఎల్ జట్లు కూడా పాకిస్థాన్ ను ఈజీగా ఓడించగలవని పేర్కొన్నారు. ఈ కామెంట్స్‌తో పాకిస్థాన్ జట్టు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడడానికి ఇంకా చాలా మెరుగుపడాల్సిన అవసంరం ఉందని ఇర్ఫాన్ పఠాన్ సూచించారు.దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (Dubai International Cricket Stadium) వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించి పాకిస్థాన్ జట్టును కేవలం 127 పరుగులకే కట్టడి చేశారు.

భారత బ్యాటర్లు లక్ష్యాన్ని కేవలం

పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్‌లో షాహీన్ అఫ్రిది (Shaheen Afridi) మినహా ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అనంతరం భారత బ్యాటర్లు లక్ష్యాన్ని కేవలం 15.5 ఓవర్లలోనే ఛేదించి విజయఢంకా మోగించారు. అభిషేక్ శర్మ (Abhishek Sharma) తొలి రెండు బంతుల్లోనే 10 పరుగులు చేసి మ్యాచ్ పై తమ పట్టును చూపించారు. ఈ గెలుపు భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచగా.. పాకిస్థాన్ జట్టు తమ ఆటతీరుపై ఆలోచించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/afghanistan-won-the-toss/sports/549954/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870