భారత క్రికెట్ చరిత్రలో ధోనీ-అశ్విన్ మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియాతో, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్(సిఎస్కెకె) తో కలిసి వీరిద్దరూ విజయాలను అందుకున్నారు. అశ్విన్ ఇప్పటికీ ధోనీనే తన మెంటార్‌గా భావిస్తాడు.చాలా కాలం తర్వాత మళ్లీ సీఎస్కే ఫ్యామిలీతో కలిసిన అశ్విన్ ధోనీ గురించి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు.
పుస్తకావిష్కరణ కార్యక్రమం
చెన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అశ్విన్ తన వందో టెస్టు సమయంలో ఓ ముఖ్యమైన సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నాడు.టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ జరుగుతున్న సమయంలో తన 106వ టెస్టు సమయంలో రిటైర్మెంట్ ప్రకటించాడు.
వందో టెస్టు
అయితే, వందో టెస్టు సమయంలోనే రిటైర్మెంట్ ఇవ్వాలని తాను అనుకున్నానని, కానీ వాయిదా వేసుకుని బోర్డర్-గావస్కర్ ట్రోఫీతో వీడ్కోలు పలికినట్లు చెప్పాడు.ధర్మశాల వేదికగా అశ్విన్ తన వందో టెస్టును ఆడాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో అశ్విన్‌కు ప్రత్యేక గౌరవం దక్కింది.

పెద్ద గిఫ్ట్
అయితే ఆ వందో టెస్టు మెమంటోని ఎంఎస్ ధోనీ చేతుల మీదుగా తీసుకోవాలని తాను అనుకున్నానని, కానీ ధోనీ ఆ మ్యాచ్‌కి రాలేదని గుర్తు చేసుకున్నాడు. అయితే సీఎస్కేలోకి తనను తీసుకుని అంతకుమించిన పెద్ద గిఫ్ట్‌ని అందించాడు, చాలా థాంక్స్ అంటూ అశ్విన్ సంతోషంలో మునిగిపోయాడు.
ఐపీఎల్‌లో అశ్విన్ ప్రస్థానం
2008లో అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తన ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. మొదటి ఏడేళ్ల పాటు సీఎస్కే తరఫున ఆడి ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే 2015లో సీఎస్కే అశ్విన్‌ను వదులుకుంది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లలో ప్రాతినిధ్యం వహించాడు.దాదాపు పదేళ్ల పాటు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌లో అశ్విన్ ఆడాడు. మళ్లీ ఇప్పుడు ఐపీఎల్ 2025లో అశ్విన్ తిరిగి తన హోం టీమ్‌కి వచ్చాడు.
ఐపీఎల్ మ్యాచ్‌లు
అశ్విన్ ఇప్పటి వరకు చెన్నై, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ తరఫున 211 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 211 ఐపీఎల్ మ్యాచ్‌లలో 180 వికెట్లు దక్కించుకోవడమే కాకుండా 800 పరుగులు కూడా చేశాడు. తన స్పిన్ మాయాజాలంతో మ్యాచ్‌ని మలుపుతిప్పిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. మరి ఈ ఐపీఎల్‌లో చెన్నై తరఫున ఎలా రాణిస్తాడో చూడాలి.తన ఆటకు గౌరవం ఇచ్చిన జట్టుకే తిరిగి రావడం అశ్విన్‌కి ఆనందాన్ని కలిగించింది. ధోనీ కింద తో ఆడే అవకాశం రావడం తన అదృష్టమని అతను గర్వంగా చెబుతున్నాడు.