kejriwal

ఆప్ వెనుకంజ!

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వెనుకబడింది. పార్టీ నేషనల్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు కీలక నేతలంతా వెనుకంజలో ఉన్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేసిన కేజ్రీవాల్ ఈసారి తడబడుతున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ లీడ్ లో కొనసాగుతున్నారు. కల్కాజీ నియోజకవర్గం బరిలో నిలిచిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కీలక నేత ఆతిశీ మార్లేనా కూడా వెనుకంజలోనే ఉన్నారు. జంగ్ పుర నుంచి పోటీ చేసిన మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా వెనుకంజలోనే ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ లీడ్ లో కొనసాగుతున్నారు.

20250110122722 Arvind Kejriwal Delhi Election 2025

షాకూర్ బస్తీ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గ్రేటర్ కైలాష్ లో ఆప్ అభ్యర్థి సౌరబ్ భరద్వాజ్ 500 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. మ్యాజిక్ ఫిగర్ 36 స్థానాలకు పైనే బీజేపీ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. ప్రస్తుతం 50 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్ లో ఉండగా.. ఆప్ అభ్యర్థులు 19 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నారు. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. ఇప్పటి వరకు వెనుకంజలో ఉన్న ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ఇప్పుడు కాస్త ముందుకొచ్చారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో అరవింద్ కేజ్రీవాల్ ముందంజలో ఉండగా.. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ వెనుకంజలో ఉన్నారు.

Related Posts
విజయ్ రాజకీయ అరంగేట్రం పై సూపర్ స్టార్ స్పందన
rajanikanth vijay

తమిళ స్టార్ హీరో విజయ్ తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించడం తమిళనాడులో రాజకీయంగా పెద్ద సంచలనం రేపుతోంది. విజయ్ తన కొత్త రాజకీయ పార్టీ "తమిళగ వెట్రి కళగం" Read more

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. ఆరుగురు గల్లంతు
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. ఆరుగురు గల్లంతు

బీహార్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైశాలిలో సెల్ఫీ తీసుకుంటూ చెరువులో మునిగి ఆరుగురు పిల్లలు గల్లంతయ్యారు. పిల్లలు ఒక పడవలో వెళ్తూ సెల్పీ తీసుకుంటున్నారు. దీంతో Read more

అమరావతిలో చంద్రబాబును కలిసిన రామ్‌దేవ్
cbn ramdev

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ కలిశారు. బుధువారం అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కు చేరుకున్న బాబా..చంద్రబాబు ను కలిశారు. Read more

Rahul Gandhi :స్పీకర్‌ ఓం బిర్లాపై మండిపడ్డ రాహుల్‌గాంధీ
RahulGandhi :స్పీకర్‌ ఓం బిర్లాపై మండిపడ్డ రాహుల్‌గాంధీ

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ స్పీకర్‌ ఓం బిర్లా తీరు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన సభ నిర్వహణ తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. Read more