Arguments in the High Court on the Kancha Gachibowli land issue

TG High court : కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో వాదనలు

TG High court: తెలంగాణ హైకోర్టులో కంచ గచ్చిబౌలి భూములపై వట ఫౌండేషన్‌, హెచ్‌సీయూ విద్యార్థులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ ప్రారంభమైంది. కంచ గచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని పిటిషన్లు కోరారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) తరఫున ఎల్‌. రవిశంకర్‌ వాదనలు వినిపిస్తున్నారు.

Advertisements
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై

కంచ గచ్చిబౌలి భూముల వద్ద భారీ వాహనాలు

గత ఏడాది జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం జీవో 54 తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారం 400 ఎకరాల ప్రభుత్వ భూమిని టీజీఐఐసీ(TGIIC)కి ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయినా సుప్రీంకోర్టు తీర్పులకు లోబడే ప్రభుత్వాలు పని చేయాల్సి ఉంటుంది. కంచ గచ్చిబౌలి భూముల వద్ద భారీ వాహనాలను ఉపయోగించి చెట్లను కొట్టేసి, భూమిని చదును చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని కొట్టివేయాలంటే నిపుణుల కమిటీ వేయాలి.

ఎన్నో రకాల అరుదైన జంతువులు

వన్య ప్రాణులు ఉన్న చోట భూములు చదును చేయాలంటే నిపుణుల కమిటీ పర్యటించాలి. నెల రోజుల పాటు అధ్యయనం చేయాలి. అక్కడ మూడు లేక్‌లు ఉన్నాయి. రాక్స్ ఉన్నాయి. ఎన్నో రకాల అరుదైన జంతువులున్నాయి. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. అయితే, ఇక్కడ సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ భూముల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి అని కోర్టుకు తెలిపారు.

Related Posts
ఐపీఎల్ 2025లో ధోని ఆడనున్నాడా
ఐపీఎల్ 2025లో ధోని ఆడనున్నాడా

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తన అభిమానులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమయ్యాడు.43 ఏళ్ల వయసులో కూడా ధోనీ ఐపీఎల్ 2025 సీజన్ కోసం బ్యాటింగ్ Read more

రేవంత్‌ రెడ్డి అధ్య క్షతన కేబినెట్‌ సమావేశం
రేవంత్ రెడ్డి అధ్యక్ష తెలంగాణ కేబినెట్ సమావేశం

రేవంత్‌ రెడ్డి అధ్య క్షతన కేబినెట్‌ సమావేశం తెలంగాణ కేబినెట్ ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Read more

తల్లికి వందనం అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు క్లారిటీ
తల్లికి వందనం అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు తల్లికి వందనం స్కీమ్ అమలుకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది జూన్ 15 నాటికి ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆయన Read more

జాతిపిత మహాత్మ గాంధీకి వర్దంతి సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ నివాళి
damodharragandhivardanthi

జాతిపిత మహాత్మగాంధీకి, ఆయన వర్దంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారు.. మహాత్ముడు చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను అందరూ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×