kadambari jethwani

కాదంబరీ జత్వానీ కేసులో నిందితుల బెయిల్‌పై హైకోర్టులో వాదనలు

సినీ నటి కాదంబరీ జత్వానీ కేసులో నిందితులుగా ఉన్న పోలీస్ అధికారులకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు విన్నవించారు. జత్వానీపై తప్పుడు కేసు నమోదు చేసి, అక్రమ అరెస్టు చేయడం వెనుక ఉన్న కుట్ర కోణాన్ని వెలికితీయాలంటే నిందితులను అదుపులోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisements

ఇబ్రహీంపట్నం పోలీసులు జత్వానీ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నిందితులుగా ఉన్న ఐపీఎస్ అధికారులైన కాంతిరాణా తాతా, విశాల్ గున్ని, హనుమంతరావు, సత్యనారాయణలు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ విఆర్‌కే కృపాసాగర్ విచారణ చేపట్టారు.

జత్వానీ తరపున న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభుదాస్, నర్రా శ్రీనివాసరావులు వాదనలు వినిపిస్తూ, ఆమె అరెస్టు వెనుక నాటి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. ఆయన ఆదేశాల ప్రకారమే జత్వానీని ముంబయి నుంచి విజయవాడకు తీసుకువచ్చి, తప్పుడు కేసు నమోదు చేశారని వివరించారు.

పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదిస్తూ ఫిబ్రవరిలో కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా జత్వానీపై కేసు నమోదైందని చెప్పారు. ఈ కేసు విచారణ పూర్తికాకుండానే జత్వానీ ఫిర్యాదు ఆధారంగా మరో కేసు నమోదు చేయడం చెల్లదని చెప్పారు. నిందితులుగా ఉన్న పోలీస్ అధికారులకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వారు కోరారు. తదుపరి వాదనల కోసం కేసు విచారణను ఈ నెల 19వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. ఈ సమయంలో నిందితులపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించారు. ఈ కేసులో న్యాయపరమైన వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

Related Posts
తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ సుజయ్ పాల్
Justice Sujoy Paul as the new CJ of Telangana High Court

హైరదాబాద్‌: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుజయ్ పాల్‌కు సీజేగా Read more

SA vs ENG వర్షం ప్రభావం.. మ్యాచ్ రద్దయితే భారత్ తో ఆడేదెవరు?
SA vs ENG మ్యాచ్‌ పై వర్షం ప్రభావం.. రద్దైతే భారత్ ప్రత్యర్థి ఎవరు?

రాచీలోని నేషనల్ స్టేడియం నేడు మరొక కీలకమైన క్రికెట్ సమరానికి వేదిక కానుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌లో భాగంగా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య కీలక Read more

Nitin Gadkari: దేశ అభివృద్ధికి రోడ్లది కీలక పాత్ర: నితిన్ గడ్కరీ
దేశ అభివృద్ధికి రోడ్లది కీలక పాత్ర: నితిన్ గడ్కరీ

భారతదేశంలో రహదారుల అభివృద్ధి దిశగా కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేస్తున్న కృషి గమనార్హం. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో నూతన ఆశలు Read more

డిసెంబరు 6న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 16వ వార్షిక రక్తదాన శిబిరాలు
HDFC Bank BLOOD DONATION

డిసెంబరు 2024: భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, తన ఫ్లాగ్‌షిప్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం పరివర్తన్‌లో భాగంగా తన దేశవ్యాప్త Read more

×