హైదరాబాద్ నగరాన్ని వినోదభరితంగా మార్చే మరో విభిన్నమైన ఈవెంట్‌కు వేదిక సిద్ధమైంది. ఈ నెల 11న ఎక్స్పీరియం ఎకో పార్క్ లో ‘టమాటా ఫైట్’ జరగనున్నట్లు ఈవెంట్ నిర్వాహకులు ప్రకటించారు. స్పెయిన్‌లో ప్రతి ఏడాది జరగే ప్రసిద్ధమైన ‘లా టమాటినా’ ఉత్సవం స్ఫూర్తిగా ఈ టమాటా ఫైట్‌ను నిర్వహిస్తున్నారు. ప్రజలు ఒకరిపై ఒకరు టమాటాలు విసురుకుంటూ ఆనందంగా ఉత్సాహంగా గడిపే ఈ ఫైట్ కోసం ఇప్పటికే భారీగా టమాటాలను సేకరిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
సరదాగా..సందడి టమాటా ఫైట్
ఈ కార్యక్రమం కేవలం టమాటాల యుద్ధంతోనే కాకుండా, సందడిగా సాగనుంది. ఈ ఈవెంట్‌లో డీజే మ్యూజిక్, డాన్స్, ఫుడ్ స్టాల్స్ వంటి వినోద అంశాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కుటుంబసభ్యులతో వచ్చేందుకు కూడా ఇది అనుకూలమైన కార్యక్రమంగా రూపొందించబడిందని చెప్పారు. యువతలో ఉత్సాహాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా ఈ వినూత్నమైన వేడుకను ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు.
గార్డెన్ కంపోస్ట్ కోసం
టమాటాలతో పోటీ ముగిసిన తర్వాత వృథా అయ్యే టమాటాలను వృథా చేయకుండా, వాటిని గార్డెన్ కంపోస్ట్ కోసం వినియోగించనున్నట్లు నిర్వాహకులు హామీ ఇచ్చారు. ఈవెంట్ సరదాగా జరగాలనే ఉద్దేశంతో అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ వినూత్న ఈవెంట్ హైదరాబాద్ ప్రజల్లో మునుపెన్నడూ చూడని అనుభూతిని అందించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also : Metro : హైదరాబాద్ మెట్రో సేవల్లో అంతరాయం