हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Train Ticket : రైల్వే టికెట్స్ బుక్ చేస్తున్నారా? జులై 1 నుంచి కొత్త రూల్

Sudheer
Train Ticket : రైల్వే టికెట్స్ బుక్ చేస్తున్నారా? జులై 1 నుంచి కొత్త రూల్

భారతీయ రైల్వే శాఖ (Department of Indian Railways) తత్కాల్ టికెట్ రిజర్వేషన్ విధానంలో కీలక మార్పులు చేసింది. జూలై 1వ తేదీ నుంచి IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా తత్కాల్ టికెట్ బుక్ చేయాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరిగా నమోదు చేయాలి. ఇప్పటివరకు పాస్‌వర్డ్ లేదా ఇతర గుర్తింపు వివరాలతో బుకింగ్ కొనసాగుతున్నా, నూతన నిబంధనల ప్రకారం ప్రయాణికుల అసలైన సమాచారం ధృవీకరించాల్సిన అవసరం ఏర్పడనుంది.

జూలై 15 నుంచి ఆధార్ ఆధారిత OTP కూడా తప్పనిసరి

ఇది సరిపోదని రైల్వే శాఖ భావించి, జూలై 15 నుంచి ఆధార్ ఆధారిత OTP ధృవీకరణ కూడా తప్పనిసరిగా చేయాలని నిర్ణయించింది. అంటే టికెట్ బుకింగ్ సమయంలో, బుక్ చేస్తున్న ప్రయాణికుడి ఆధార్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతానికి తత్కాల్ టికెట్లకే వర్తించనుండగా, భవిష్యత్తులో సాధారణ రిజర్వేషన్లకూ ఇది వర్తించే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.

పారదర్శకత కోసం కొత్త మార్గదర్శకాలు

రైల్వే శాఖ ఈ మార్పులను టికెట్ల బుకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంపునకు, మోసాలు నివారించడానికి తీసుకువచ్చిందని పేర్కొంది. అనేక మంది ఏజెంట్లు నకిలీ ఐడీలతో టికెట్లు బుక్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇది ప్రయాణికుల హక్కులను కాపాడడంలో, న్యాయమైన విధంగా టికెట్లను అందించడంలో దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Trump : చైనాతో డీల్ కుదిరింది – ట్రంప్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870