Are private schools better than government schools?: CM Revanth Reddy

ప్రభుత్వం కంటే ప్రైవేట్ పాఠశాలలు గొప్పవా ? : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ..నిరుద్యోగ సమస్య తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిందని, రాష్ట్ర సాధనలో నిరుద్యోగులు క్రియాశీల పాత్ర పోషించారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగులు పునాదులుగా మారారని పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి ఉద్యమం పట్ల బాధ్యత లేక నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరకలేదన్నారు. గత ప్రభుత్వ పెద్దల ఉద్యోగాలు తీస్తేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని తాను చెప్పినట్లు సీఎం గుర్తు చేశారు.

ప్రభుత్వం కంటే ప్రైవేట్ పాఠశాలలు

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక 50వేలకు పైగా నియామకాలు

జూనియర్ లెక్చరర్‌, పాలిటెక్నిక్‌ లెక్చరర్ల ఉద్యోగాలకు ఎంపికైన 1,532 మందికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. కొత్తగా ఉద్యోగ బాధ్యతలు చేపడుతున్న వారికి సీఎం అభినందనలు తెలిపారు. కొత్త అధ్యాపకులు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంవైపు నడిపించాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక 50వేలకు పైగా నియామకాలు చేపట్టాం. ఉద్యోగ నియామకాలకు సంబంధించి కోర్టుల్లో ఉన్న చిక్కుముళ్లు విప్పుతూ సమస్యలు పరిష్కరించాం. గతంలో సంతలో సరకులా ప్రశ్నపత్రాలు అమ్మారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందని పెద్దలు చెప్పారు.

విద్యార్థుల భవిష్యత్తును విద్యాశాఖ తీర్చిదిద్దాలి

30వేల ప్రభుత్వ పాఠశాలల్లో 25లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 11వేల ప్రైవేటు పాఠశాలల్లో 36.7లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వం కంటే ప్రైవేటు పాఠశాలలు గొప్పవా? ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు రూ.25వేల వరకు ఖర్చవుతుంటే.. ప్రభుత్వ బడుల్లో రూ.లక్ష వరకు ఖర్చవుతోంది. విద్యార్థుల భవిష్యత్తును విద్యాశాఖ తీర్చిదిద్దాలి. గతంలో విద్యాశాఖ నిర్లక్ష్యానికి గురైంది. విద్యాశాఖను ప్రక్షాళన చేసి ప్రభుత్వం అండగా ఉంది. విద్యకు ప్రాధాన్యం ఇచ్చి విద్యాశాఖకు రూ.21,650 కోట్లు కేటాయించాం అని సీఎం వివరించారు.

Related Posts
రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర విమర్శలు
Rahul Gandhi

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మధ్యలో, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముంబైలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా, ఆయన బీజేపీని తీవ్రంగా విమర్శించారు. రాహుల్ గాంధీ, Read more

హైకోర్టులో కేటీఆర్ పిటిషన్
హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర మలుపు చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అవమానించారనే ఆరోపణలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదైన నేపథ్యంలో, ఆయన Read more

బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టం!
nirmala sitharaman

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం-1961ను రద్దు చేసి, Read more

ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్న ప్రధాని మోడీ
PM Modi will visit Gujarat today and tomorrow

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాక.. విశాఖ నగరంలో ప్రధాని Read more