అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసాక ప్రపంచవ్యాప్తంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు విదేశాలపై భారీ సుంకాలు మరోవైపు అమెరికా వీసాల పై భయాందోళనలు పుట్టుకొస్తున్నాయి. ఈ తరుణంలోనే అమెరికాలోని భారతీయ ఉద్యోగులు ప్రమాదంలో ఉన్నారా అనే ఆలోచన మొదలవుతుంది. విదేశీ ఉద్యోగుల చట్టవిరుద్ధమైన నియామక ప్రాధాన్యతలను సవాలు చేసే ప్రయత్నాలను డోనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ముమ్మరం చేస్తోంది, మరోవైపు దీనికి సంబంధించి ఇలాంటి పద్ధతులు అమెరికన్ ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తాయని వాదిస్తోంది.

అమెరికా వీసాల పై భయాందోళనలు
19 ఫిబ్రవరి 2025న ఈక్వల్ ఎంప్లాయిమెంట్ ఆపర్చునిటీ కమిషన్ (EEOC) కంపెనీలకు అమెరికన్ అభ్యర్థుల కంటే విదేశీ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వకూడదని ఓ హెచ్చరిక జారీ చేసింది. అమెరికన్ ఉద్యోగులపై చట్టవిరుద్ధమైన పక్షపాతం దేశవ్యాప్తంగా వివిధ పరిశ్రమలలో పెద్ద ఎత్తున ఉన్న సమస్య అని ఆండ్రియా లూకాస్ అన్నారు. చాలా కంపెనీలు అమెరికన్ల కంటే అక్రమ వలసదారులు, వలస కార్మికులు, వీసా హోల్డర్లు లేదా ఇతర వలసదారులను ఇష్టపడే విధానాలకి మద్దతు చేస్తున్నాయి. ఈ పద్ధతి సమాఖ్య ఉపాధి చట్టాన్ని ప్రత్యక్షంగా ఉల్లంఘిస్తుంది. ఈ రకమైన చట్టవిరుద్ధ వివక్షను తగ్గించడం వల్ల కంపెనీ ప్రోత్సాహకాలు మారుస్తుంది, అక్రమ విదేశీ కార్మికులకు డిమాండ్ తగ్గుతుంది ఇంకా యునైటెడ్ స్టేట్స్ చట్టపరమైన వలసల దుర్వినియోగం కూడా తగ్గుతుంది.
వేతనాల లొసుగులు
ఉల్లంఘనకు పాల్పడిన కంపెనీలపై EEOC చర్యలు తీసుకుంటుందని లూకాస్ హెచ్చరించారు. విదేశీ కార్మికులను కంపెనీలు ఎందుకు కోరుకుంటాయి: కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి ఇష్టపడే కొన్ని కారణాలను EEOC వివరించింది వాటిలో కొన్నిసార్లు వేతనాల లొసుగులు లేదా చట్టవిరుద్ధమైన చెల్లింపులతో తక్కువ ఖర్చు, కార్మిక హక్కుల గురించి ఎక్కువగా ఆలోచన లేకపోవడంతో విదేశీ ఉద్యోగులను దోచుకోవడం సులభం అనే నమ్మకం దీనికి తోడు విదేశీ ఉద్యోగుల స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉంటారనే భావన. ఈ ఆందోళనలు ఉన్నప్పటికీ H-1B వీసా ప్రోగ్రాం అమెరికన్ ఉద్యోగులను ప్రభావితం చేస్తుందనే వాదనలను అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ తోసిపుచ్చింది. వారి పరిశోధన ప్రకారం H-1B ఉద్యోగులు ఎక్కువ వేతనాలు సంపాదిస్తారు. 2021లో H-1B ఉద్యోగికి యావరేజ్ జీతం $108,000 ఇతర US ఉద్యోగికి $45,760.
వీసా హోల్డర్లకే ప్రాధాన్యత
మెటాలో దావా వేయడం ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది, ఖర్చులను తగ్గించుకోవడానికి కంపెనీలు అమెరికన్ల కంటే వీసా హోల్డర్లకే ప్రాధాన్యత ఇస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఒక ఫెడరల్ న్యాయమూర్తి కేసును కొనసాగించవచ్చని తీర్పునిస్తూ, విదేశీ ఉద్యోగులపై టెక్ రంగం ఆధారపడటంపై పరిశీలనను ముమ్మరం చేశారు. ట్రంప్, జో బిడెన్ ప్రభుత్వాలు గతంలో కూడా H-1B నిబంధనలను కఠినతరం చేయడానికి చర్యలు ప్రవేశపెట్టాయి కూడా.