kumbh mela 2025

నిధులన్నీ కుంభమేళాకేనా..? మమత బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగే కుంభమేళాకు వేల కోట్ల నిధులను కేటాయిస్తున్న NDA ప్రభుత్వం, బెంగాల్‌లో జరగే గంగాసాగర్ మేళాకు మాత్రం ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గంగాసాగర్ మేళా కూడా ఎంతో ప్రాముఖ్యమున్న పుణ్యక్షేత్రమని, దీనికి సరైన మౌలిక సదుపాయాలు అవసరమని ఆమె పేర్కొన్నారు.

గంగాసాగర్ మేళా గంగానది, బంగాళాఖాతం కలిసే ప్రదేశంలో ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించబడుతుంది. ఈ పుణ్యస్నానం కోసం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. అయితే, ఈ ప్రదేశానికి సరైన రవాణా సౌకర్యాలు లేవని, ముఖ్యంగా నీటిమార్గం ద్వారా ప్రయాణం మరింత సౌకర్యవంతమవుతుందని మమతా బెనర్జీ చెప్పారు.

ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ బ్రిడ్జి నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయకపోవడం ఆవేదన కలిగిస్తోందని ఆమె అన్నారు. గంగాసాగర్‌ ప్రాంత అభివృద్ధి పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా ఉందని, తాము స్వయంగా తమ ప్రభుత్వ నిధులతోనే బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామని మమత తెలిపారు. ఇది భక్తులకు ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని పేర్కొన్నారు.

కుంభమేళాకు కేంద్రం వేల కోట్ల నిధులు కేటాయిస్తే, గంగాసాగర్ మేళాకు కనీసం ప్రాథమిక సదుపాయాలు అందించకపోవడం అన్యాయం అన్నారు. గంగాసాగర్ మేళా కూడా దేశానికే గర్వకారణమైన ఆధ్యాత్మిక పండుగ అని, దీనికి కేంద్రం సముచిత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

Related Posts
ఇళయరాజా ఇంటికెళ్లిన సీఎం స్టాలిన్
cm stalin met ilayaraja

సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా, మార్చి 8వ తేదీన లండన్‌లో ఘనమైన సింఫనీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆసియా ఖండానికి Read more

ఢిల్లీ ఎన్నికలు – జోరుగా బెట్టింగ్ లు
rahul modi kejriwal

చాలా కాలం తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు హోరీహోరీగా జరుగుతున్నాయి. వరుసగా మూడుసార్లు గెలిచి అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి విపక్ష బీజేపీ నుంచి గట్టి Read more

నెల రోజులు మాంసం దుకాణాలు బంద్.. ఎక్కడ..ఎందుకు ?
Meat Shops

బెంగళూరులో నిర్వహించనున్న ఏరో ఇండియా 15వ ఎడిషన్ షో కారణంగా ప్రత్యేక ఆదేశాలు జారీచేశారు. ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు యెలహంకలో ఈ ప్రతిష్ఠాత్మక ఎయిర్ Read more

Jagan: వైవీ సుబ్బారెడ్డి తల్లికి జగన్ నివాళి
Jagan: సుబ్బారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆమె 85 సంవత్సరాల వయస్సులో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ Read more