Independence Day : నేటి తాజా వార్తలు 15-08-2025
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రాహుల్ గైర్హాజరు..బీజేపీ మండిపాటు
- ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన ప్రధాన కార్యక్రమానికి రాహుల్ గాంధీ, ఖర్గే హాజరుకాకపోవడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది.
- బీజేపీ ప్రతినిధి గౌరవ్ భాటియా, రాహుల్‌ను "పార్ట్‌టైమ్ రాజకీయ నాయకుడు"గా, "పాకిస్థాన్ ప్రేమికుడు"గా వ్యాఖ్యానించారు.
- సుధాన్షు త్రివేది, కాంగ్రెస్‌కు దేశ వ్యతిరేక ధోరణులు కొత్తకాదని విమర్శించారు.
- రాహుల్ ప్రస్తుతం వయనాడ్‌లో తన నియోజకవర్గ పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
- గైర్హాజరు రాజకీయ వాదనలకు దారితీస్తూ, వేడుకల కంటే ఇతర కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చారని బీజేపీ ఆరోపిస్తోంది.
???? పూర్తి కథనం కోసం : ఇక్కడ క్లిక్ చేయండి
వెంకటేష్.. త్రివిక్రమ్ కొత్త సినిమా ప్రారంభం
- టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో కొత్త చిత్రం ప్రారంభమైంది.
- స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
- ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ వెంకటేశ్ కెరీర్‌లో 77వ సినిమా అవుతుంది.
- గతంలో ‘మల్లీశ్వరి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రాలకు త్రివిక్రమ్ మాటల రచయితగా పనిచేసి విజయాలు సాధించారు.
- కొత్త సినిమా కథ, నటీనటులు, టెక్నీషియన్ బృందంపై వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
???? పూర్తి కథనం కోసం : ఇక్కడ క్లిక్ చేయండి
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాలో డబ్బు జమ
- రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల తొలి విడత లబ్ధిదారుల్లో సుమారు 30% మందికి ఆధార్, బ్యాంక్ వివరాలు సరిపోలకపోవడంతో చెల్లింపులు నిలిచిపోయాయి.
- ప్రభుత్వం రెండు రోజుల గడువులో ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు సరిచేసుకునే అవకాశం కల్పించింది.
- తప్పులు సరిదిద్దిన తర్వాత డబ్బులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయి.
- కలెక్టర్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల సహాయంతో పేర్లు, ఆధార్ నంబర్లు సవరించుకోవచ్చు.
- లబ్ధిదారులు ఈ అవకాశాన్ని కోల్పోకుండా వెంటనే వివరాలు సరిచేయాలని అధికారులు సూచించారు.
???? మరింత సమాచారం కోసం : ఇక్కడ క్లిక్ చేయండి
ఇవాళి నుంచే ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం
ఆంధ్రప్రదేశ్‌లో ‘స్త్రీ శక్తి’ పథకం ప్రారంభం
- మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.
- CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఈ రోజు గుంటూరులో ప్రారంభోత్సవం.
- ప్రయాణికులు ఐడీ చూపించి ‘జీరో ఫేర్ టికెట్’ తీసుకోవాలి.
- రవాణా ఖర్చులు తగ్గించి, మహిళా సాధికారతకు తోడ్పడనుంది.
???? పూర్తి కథనం కోసం : ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
- గోల్కొండ కోటలో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరణ.
- ప్రసంగంలో స్వాతంత్య్రం యొక్క అసలైన అర్థాన్ని గుర్తు చేస్తూ పిలుపు.
- మంత్రులు, అధికారులు, వారి కుటుంబాల ఉత్సాహభరిత పాల్గొనడం.
- ప్రజల శ్రేయస్సే నిజమైన స్వాతంత్య్ర ఫలమని ముఖ్య సందేశం.
???? పూర్తి కథనం కోసం : ఇక్కడ క్లిక్ చేయండి
పాకిస్థాన్‌కు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
- 79వ స్వాతంత్ర్య దినోత్సవం: పాకిస్థాన్‌కు ప్రధాని మోదీ గట్టి హెచ్చరిక
- ఎర్రకోటపై ప్రధాని మోదీ – “అణు బెదిరింపులకు భారత్ మౌనంగా ఉండదు.”
- దేశ భద్రత, రైతుల హక్కులపై అచంచల వైఖరి ప్రకటింపు.
- సింధు జలాల ఒప్పందం నిలిపివేతను పునరుద్ఘాటిస్తూ, నీటిపై కఠిన నిర్ణయాల సంకేతం.
- 140 కోట్ల భారతీయుల సంకల్పానికి స్వాతంత్ర్య దినోత్సవం ప్రతీక అని వ్యాఖ్య.
???? పూర్తి కథనం కోసం : ఇక్కడ క్లిక్ చేయండి
ఎర్రకోట వద్ద జెండా ఆవిష్కరించిన ప్రధాని
- 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయ పతాకావిష్కరణ.
- వాయుసేన హెలికాప్టర్ల “ఆపరేషన్ సిందూర్” పూల వర్షం ప్రత్యేక ఆకర్షణ.
- ప్రధాని వరుసగా 12వసారి ఎర్రకోట బురుజులపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగం.
???? పూర్తి కథనం కోసం : ఇక్కడ క్లిక్ చేయండి