RRB:ఏప్రిల్‌28 నుంచి ఆర్‌ఆర్‌బీ పరీక్షలు

RRB:ఏప్రిల్‌28 నుంచి ఆర్‌ఆర్‌బీ పరీక్షలు

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ( ఆర్‌ఆర్‌బి) రైల్వే పరీక్షల తేదీలను ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూల్ విడుదలైంది.పారా-మెడికల్ (సిబిటి) పరీక్షలు ఏప్రిల్ 28 నుండి 30 వరకు జరగనున్నాయి.పరీక్షలకు సంబంధించిన ఎగ్జాం సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లు పరీక్షకు 10 రోజుల ముందు విడుదల చేయనున్నారు. అలాగే, అడ్మిట్ కార్డులు పరీక్షకు నాలుగు రోజుల ముందు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఆన్‌లైన్ విధానం

మొత్తం మూడు రోజుల పాటు ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు గత ఏడాది సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటీసు నంబర్ 04/2024 ద్వారా పారా-మెడికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద వివిధ రైల్వే రీజియన్లలో 1376 పారా-మెడికల్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.

రెస్పాన్స్ షీట్

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్ పిఎఫ్ ), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ ( ఆర్ పి ఎస్ఎఫ్) పరీక్షల ప్రాథమిక కీ ఇటీవల విడుదలైంది. అభ్యర్థులు మార్చి 24 నుంచి 29 వరకు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసి ప్రశ్నపత్రం, రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.అభ్యర్థులకు మార్చి 29 సాయంత్రం 6 గంటల వరకు ఆన్సర్ కీ పై అభ్యంతరాలను తెలిపే అవకాశం ఉంది. అభ్యంతరాల ప్రక్రియలో ఒక్కో ప్రశ్నకు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అభ్యర్థులు ఇచ్చిన సమాధానం సరైనదిగా తేలితే, చెల్లించిన మొత్తం తిరిగి రీఫండ్ చేయనున్నారు.

rrb railway recruitment 1726922313

ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4208 ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నారు. మార్చి 2 నుంచి 18 వరకు ఈ పరీక్షలు నిర్వహించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

అభ్యర్థులకు కీలక సూచనలు

పరీక్షకు 10 రోజుల ముందు ఎగ్జాం సిటీ వివరాలు విడుదల చేయనున్నారు.అడ్మిట్ కార్డులు పరీక్షకు 4 రోజుల ముందు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.ఆన్సర్ కీ పై అభ్యంతరాలు తెలిపేందుకు మార్చి 29 వరకు గడువు ఉంది.అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా సందర్శిస్తూ తాజా సమాచారాన్ని తెలుసుకోవాలి.

Related Posts
బడ్జెట్ పై చంద్రబాబు భారీ అంచనాలు
modi and chandra babu

ఫిబ్రవరి అనగానే మధ్యతరగతి వేతన జీవులు అందరికీ గుర్తుకు వచ్చేది కేంద్ర బడ్జెట్. ఆ మాటకొస్తే వేతన జీవులకే కాదు.. దేశంలోని ప్రతి ఒక్కరిపైనా బడ్జెట్ ప్రభావం Read more

ఆర్జీ కార్ కేసులో నిందితుడి తల్లి ఆవేదన
ఆర్జీ కార్ కేసులో నిందితుడి తల్లి ఆవేదన

సంజయ్ రాయ్ తల్లి మాలతి రాయ్ శంభునాథ్ పండిట్ లేన్లలో నివసిస్తున్నారు. తన కుమారుడు సంజయ్ రాయ్‌ను దోషిగా నిర్ధారించడంపై మాలతి, "నాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు, Read more

ఇంటి అద్దె చెల్లించే వారికి శుభవార్త..నిర్మల సీతారామన్.!
ఇంటి అద్దె చెల్లించే వారికి శుభవార్త .. నిర్మల సీతారామన్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం దేశ బడ్జెట్‌ను సమర్పించారు ఈ బడ్జెట్‌లో అద్దె చెల్లించే యజమానులకు శుభవార్త అందించారు. ఇంటి అద్దె ద్వారా వచ్చే ఆదాయ Read more

ఢిల్లీలో కుంభకోణానికి పాల్పడింది ఎవరో ప్రజలు గుర్తుపెట్టుకోవాలి: రాహుల్‌
People should remember who committed the scam in Delhi.. Rahul

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఆమ్‌ ఆద్మీ పార్టీ పై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో ఈరోజు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఒకే విడతలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *