దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో (central government departments) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు శుభవార్త. నేడు ఉదయం 11 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 16వ ‘రోజ్‌గార్ మేళా’లో భాగంగా 51,000 మందికి వర్చువల్ విధానంలో నియామక పత్రాలు అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని దేశంలోని 47 ప్రదేశాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
రైల్వే, తపాలా, హోంశాఖల్లో భర్తీ
ఈ నియామకాల్లో రైల్వే, తపాలా, హోం శాఖలతో పాటు వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. దేశంలోని యూత్‌కు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేళాలను నిర్వహిస్తోంది. నియామక పత్రాల పంపిణీ అనంతరం ప్రధాని మోదీ (Modi) అభ్యర్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఇప్పటివరకు 10 లక్షల ఉద్యోగాల భర్తీ
ఇప్పటికే నిర్వహించిన 15 రోజ్‌గార్ మేళాల ద్వారా సుమారు 10 లక్షల మందికి పైగా ఉద్యోగ నియామక పత్రాలు అందించబడ్డాయి. ఈ మేళాల ద్వారా యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు పెరిగినట్టు కేంద్రం పేర్కొంటోంది. తక్కువ సమయంలో నియామక ప్రక్రియ పూర్తవుతుండటంతో అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొంది.
Read Also ; Pakistan : పాకిస్థాన్ కు చుక్కలు చూపిస్తున్న బ్లఫ్