Application deadline extension for liquor shops in AP

ఏపీలో మద్యం షాపుల దరఖాస్తుల గడువు పొడిగింపు

అమరావతి: కొత్త మ‌ద్యం పాల‌సీని తీసుకొచ్చిన ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం కొత్త‌ మ‌ద్యం దుకాణాల కోసం ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, మ‌ద్యం షాపులు ద‌క్కించుకోవాల‌నుకునే ఆశావ‌హుల‌కు ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. కొత్త మ‌ద్యం దుకాణాల ద‌ర‌ఖాస్తు గ‌డువును పొడిగించింది. ఈ మేర‌కు ఇవాళ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

టెండ‌ర్ల షెడ్యూల్ మార్పు కొరుతూ వివిధ జిల్లాల్లో ఉన్న ద‌ర‌ఖాస్తుదారుల నుంచి భారీ ఎత్తున్న అభ్య‌ర్థ‌న‌లు రావ‌డంతో ఎక్సైజ్ అధికారులు ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్ల‌డం జ‌రిగింది. దీంతో స‌ర్కార్ షెడ్యూల్‌ను మార్చింది.

ఈ నెల 11 సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ద‌రఖాస్తులు స్వీక‌రిస్తామ‌ని ప్ర‌క‌టించింది. అలాగే 14న మ‌ద్యం షాపుల‌కు లాట‌రీ విధానంలో డ్రా తీసి, 16 నుంచి ద‌ర‌ఖాస్తుదారుల‌కు దుకాణాల‌ను కేటాయించ‌డం జ‌రుగుతుంద‌ని పేర్కొంది.

ఇదిలాఉంటే.. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మ‌ద్యం దుకాణాల‌కు గాను మంగ‌ళ‌వారం రాత్రి వ‌ర‌కు 41,348 ద‌ర‌ఖాస్తు వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు. త‌ద్వారా ప్ర‌భుత్వ ఖ‌జానాకు రూ.826.96కోట్ల ఆదాయం వ‌చ్చి చేరిన‌ట్లు స‌మాచారం. కాగా, ఒక్కొ ద‌ర‌ఖాస్తుకు నాన్‌-రిఫండ‌బుల్ కింద రూ.2ల‌క్ష‌లు క‌ట్టాల్సి ఉన్న విష‌యం తెలిసిందే.

Related Posts
ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే పోటీ: కేజ్రీవాల్
AAP will contest Delhi assembly elections alone: ​​Kejriwal

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రానున్న ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు అధికార ఆప్‌ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా అసెంబ్లీ Read more

తొందరపాటు చర్య సరికాదు : ఆర్జీ కర్ మృతురాలి తండ్రి
Hasty action is not right: RG Kar is father of the deceased

కోల్‌కతా: వెస్ట్ బెంగాల్ లోని ఆర్జీకర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు ఆగస్టు 9 న సెమినార్ హల్ లో జూనియర్ వైద్యురాలు దారుణంగా హత్యగావించబడిన విషయం తెలిసిందే. Read more

విజయవాడ మెట్రో స్టేషన్ భూసేకరణకు అడుగులు
విజయవాడ మెట్రో స్టేషన్ భూసేకరణకు అడుగులు

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్: తొలి అడుగు విజయవాడ వాసుల కల మెట్రో రైలు, విభజన అనంతరం పలుమార్లు ప్రకటనలు ఇచ్చినప్పటికీ, ఇప్పుడు ఆ కల నెరవేర్చడానికి Read more

పర్యావరణ కార్యకర్త తులసి గౌడ ఇక లేరు..
tulsi gowda

తులసి గౌడ, 86 సంవత్సరాల వయస్సు గల ప్రముఖ భారతీయ పర్యావరణ వేత్త, డిసెంబర్ 16, 2024న కర్ణాటక రాష్ట్రం, దావణగెరే జిల్లాలో మరణించారు. ఆమె ఆరోగ్య Read more