ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా, పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైందని, ఈ నెల మూడో వారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 20 వరకు జరిగాయి. ఈ పరీక్షలకు దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు పూర్తయిన తర్వాత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితాల విడుదలపై అధికారిక ప్రకటన కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఇంటర్ బోర్డు అధికారుల ప్రకారం, ఏప్రిల్ 6వ తేదీలోగా మూల్యాంకనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మూల్యాంకనం పూర్తైన తర్వాత ఫలితాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి కనీసం ఒక వారం సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంటే, ఏప్రిల్ 12 నుంచి 15 మధ్యలో ఫలితాలు విడుదల చేసే అవకాశముంది.
ఫలితాలు ఎలా చెక్ చేసుకోవచ్చు?
ఇంతకు ముందు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను విడుదల చేసేవారు. అయితే, ఈసారి ఫలితాలను వాట్సాప్‌లో కూడా అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. విద్యార్థులు 9552300009 అనే వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ పంపితే, వారికి వారి ఫలితాలు అందుతాయి. అంతేకాదు, విద్యార్థులు BIEAP అధికారిక వెబ్‌సైట్ https://bie.ap.gov.in/ ద్వారా కూడా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు మే లేదా జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది. ఫలితాల విడుదల తర్వాత, సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ఇంటర్ బోర్డ్ ప్రకటించనుంది. ఏపీలో ఇంటర్ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారిక ప్రకటన ప్రకారం, ఫలితాలు ఏప్రిల్ మూడో వారంలో విడుదలయ్యే అవకాశముంది.